మాదకద్రవ్యాలకు బానిసైన 31 ఏళ్ల డేనియల్ ఫ్రాంజోని తన జీవితాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి కొన్ని నెలల క్రితం మిచిగాన్ లోని అల్పేనాకు మకాం మార్చింది. అయితే తనకు ముగ్గురు పిల్లలు కాగా ప్రస్తుతం మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉంది. తన జీవితంలో ఎన్నో బాధలను ఎదుర్కొన్న ఆమెకు చివరికి తన భర్త కూడా విడాకులిచ్చి ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. చేతిలో ఎక్కువ డబ్బు లేని ఆమె అల్పేనాకు వచ్చిన తరువాత ఇల్లు లేనటువంటి వారికి ఆశ్రయం కల్పించే ఒక హౌజ్ లో తల దాచుకుంది. అలాగే, తన పిల్లలను మంచిగా పోషించాలనే ఉద్దేశంతో 'థండర్ బే రివర్' రెస్టారెంట్లో హోటల్ సర్వర్ గా చేరింది.


అయితే ఆ రెస్టారెంట్ కు ఒక కుటుంబం ప్రతి ఆదివారం వచ్చి వెళుతూ ఉండేది. అదే తరహాలో నూతన సంవత్సరం రోజు కూడా ఆ దంపతులు రెస్టారెంట్ కు వచ్చి ఫుడ్ తిన్నారు. అయితే వాళ్లిద్దరూ తిన్నందుకు బిల్లు $23 అయ్యిందని డేనియల్ ఫ్రాంజోని వచ్చి వాళ్లకు ఒక రిసిప్ట్ ఇచ్చింది. అప్పుడు ఆ దంపతులు లోని మగ వ్యక్తి.. ' ఒకవేళ మీకు ఎవరైనా టిప్ ఇస్తే మీరు ఒక్కరే తీసుకుంటారా లేకపోతే ఇతర వాళ్ళు కూడా టిప్ ను పంచుకుంటారా?' అని ఫ్రాంజోని ని అడగగా 'లేదండి, టిప్పు ఎవరికి ఇస్తే అది వాళ్ల ఒక్కరికి మాత్రమే చెందుతుంది', అని ఆమె చెప్పి వెళ్ళిపోయింది.


తర్వాత వారి టేబుల్ వద్ద బిల్లుతో సహా డబ్బులు తీసుకోవడానికి ఫ్రాంజోని వచ్చినప్పుడు.. ఆమె ఒక నమ్మశక్యం కాని టిప్ అమౌంట్ ను బిల్లు పై చూసింది. ఇంతకీ ఆ బిల్లు పై ఏం రాసి ఉందంటే.. 'హ్యాపీ న్యూ ఇయర్, డేనియల్. 2020tipchallenge, ' అని రాసి ఉంది. అలాగే టిప్ కోసం బిల్లులో ఉన్నటువంటి ఖాళీలో '$2,020' అని రాసుంది. దాంతో ఆమె వెంటనే ఏడ్చుకుంటూ తన మేనేజర్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి.. 'సార్, ఇది నిజమేనా' అంటూ అడిగింది. అప్పుడు ఆ రెస్టారెంట్ మేనేజర్... 'అవునమ్మా, అది నిజమే! నీకు ఎవరో పుణ్యాత్ముడు $2,020(₹1.44లక్షలు) టిప్ ఇచ్చాడు. పండగ చేస్కో' అని అన్నాడు. ఇక దాంతో ఆమె బాగా ఆనంద పడిపోయి... మీడియాతో మాట్లాడుతూ.. ' నేను నా డ్రైవింగ్ లైసెన్స్ కి డబ్బులు కట్టుకుంటాను. మిగతా డబ్బులు నా పిల్లల కోసం దాచి పెడతాను. ఎవరో పుణ్యాత్ముడు నాకు ఎంతో సహాయం చేశాడు. వాళ్లకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను,' అని చెప్పుకొచ్చింది.

https://mobile.twitter.com/JennyMcCarthy/status/1212489462476869633


ఇకపోతే, 2020 సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత నెట్టింట #2020tipchallenge కొనసాగుతుంది. అయితే ఈ ఛాలెంజ్ లో పాల్గొనేందుకు హోటల్/ రెస్టారెంట్ సర్వర్లకు $2020 ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పటికే ఒక అమెరికన్ నటుడు డోన్నీ కూడా బెథానీ అనే ఒక హోటల్ సర్వర్ కు 2020 డాలర్లను టిప్ గా ఇచ్చాడు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలనుకున్నాడు కానీ అతని భార్య ఈ టిప్ ఇచ్చిన బిల్లు ను ట్విట్టర్ లో అప్లోడ్ చేసి అతని మంచి మనసుని కొనియాడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: