రాను రాను మనిషి అన్ని విషయాల్లోనూ సరికొత్త పద్ధతుల్లో విధానాల్లో ముందుకు సాగుతున్నప్పటికీ, వాటి కంటే అత్యంత విలువైన, మరియు వెలకట్టలేని మనవ సంబంధాలను మాత్రం మెల్లగా కాళ రాస్తూ ముందుకు పోతున్నాడు అనే చెప్పాలి. నిజానికి ఒకప్పటి కాలంలో ఆడవాళ్లలో చాలావరకు మంచి సఖ్యత ఉండేది. ముఖ్యంగా భర్త యొక్క అక్క, చెల్లెళ్లయిన ఆడపడుచులను అప్పట్లో తమ బిడ్డ మాదిరిగా చూసేవారు భార్యలు. అయితే ఆ పద్ధతులకు రాను రాను తిలోదకాలిస్తూ చాలా మంది భార్యలు, ఆడపడుచులను అలక్ష్యం చేస్తూ, కేవలం తమ వైపు బంధువులను మాత్రమే ప్రేమగా చూసుకుంటున్న ఘటనలు ఇటీవల అక్కడక్కడా మరింత ఎక్కువగా కనపడుతున్నాయి. 

 

ఇక భార్య తరపు బంధువుల్లో ముఖ్యంగా భార్య అక్క, చెల్లెళ్లకు ఇస్తున్న విలువలు తమ సొంత అక్క, చెల్లెళ్లకు ఇవ్వడం లేదని కొందరు భర్తలు లోలోపల మధపడుతున్న ఘటనలు వెలుగులోకి రానప్పటికీ, చాలా ఇళ్లల్లో ఇటువంటివే జరుగుతున్నాయి. నిజానికి ఆడపడుచుని కూడా తమ తోబుట్టువు మాదిరిగా చూడగలిగే స్త్రీ, తన కుటుంబాన్ని ఎంతో గొప్పగా నడుపగలదు. ఎందుకంటే ఎప్పుడైతే తన, పర అనే బేధాలు భార్య, ఆడపడుచుల మధ్య రావో, అప్పుడు అందరం ఎంతో సంతోషంగా కలసి ఉండడంతో పాటు ఇంట్లో ప్రశాంతత వెల్లివిరుస్తుంది. నిజానికి మన పూర్వీకులు చాలావరకు వదిన, 

 

ఆడపడుచులను సమంగా చూసే వారు, ఎందుకంటే అప్పుడు ఎక్కువగా అందరిలో మన అనే భావన ఉండేది. అయితే రాను రాను మనిషికి డబ్బు వ్యామోహం, తన సొంత కుటుంబం మీద ప్రేమ మరింత పెరిగి, మెల్లగా మన అనే పదంలో మ అనే అక్షరం పూర్తిగా అంతరించి న అనే అక్షరం మాత్రమే మిగిలింది. అందుకే ప్రస్తుత సమాజంలో చాలా మంది భార్యలు ఆడపడుచులను తమ శత్రువులుగా భావిస్తున్నారు అనేది అందరూ ఒప్పుకుని తీరవలసిన నగ్న సత్యమని అంటున్నారు మానసిక నిపుణులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: