వీకెండ్‌ వస్తే చాలు. పబ్బులు, పార్టీలు, డిస్కోథెక్‌లు.. షాపింగ్‌మాళ్లు.. మల్టీఫ్లెక్స్‌లు.. అంటూ తిరిగే యువతరం నగరాల్లో పెరిగిపోతోంది. వారికి ఇంతకంటే అర్థవంతమైన జీవితం మరొకటి లేదు. పట్టణాలు, నగరాలకు వలస వచ్చిన ఎక్కువ మంది యువతీయువకుల మూలాలు గ్రామాలు. వారిది వ్యవసాయ కుటటుంబ నేపథ్యం కాబట్టి సేద్యంతో అనుబంధం ఉంటుంది. నగరాల్లోకి వచ్చిన తరువాత మట్టివాసనలు మాయమైపోతాయి. కాలువ గట్టు తెలీదు. కలుపు తీయడం, బురద మడిలో దుక్కి చేయడం ఉండవు. ‘‘నగరాల్లో ఉద్యోగాల్లో చేరినా వాటిని మరిచిపోకూడదు. మరో వైపు ఏ రైతులు అయితే కూలీలను పెట్టుకోలేకపోతున్నారో వారికి సహాయపడాలి అనుకున్నాం.

 

గ్లోబ‌లైజేష‌న్ పుణ్యమా అని హైటెక్ సిటీకి కల్చర్‌లో ఊహించ‌ని మార్పుల చోటు చేసుకుంటున్నాయి. ఉపాధి అవ‌కాశాలు పెరిగాయి. సంపాద‌న మార్గాలు క్రియేట్ అయ్యాయి. దీంతో సిటీ లైఫ్ స్టైల్ మారిపోయింది. న‌గ‌రంలో పార్టీ క‌ల్చ‌ర్ కామ‌న్ అయిపోంది. ప‌బ్ క్ల‌బ్ క‌ల్చ‌ర్ తో పాటు రేవ్ పార్టీలు కామన్‌గా మారాయి. అందుకే వీకెండ్ వచ్చిందంటే చాలు... పబ్బులు, క్ల‌బ్బులు జ‌నంతో కిట‌కిట‌లాడుతున్నాయి.

 

ఒక‌ప్పుడు పార్టీ అంటే ఏ విస్కీయో.. బ్రాందీయో తాగేవారు. కానీ ఇప్పుడు మాత్రం మ‌త్తులో జోగుతున్నారు కుర్ర‌కారు. న‌షా నిషాలో తూగుతున్నారు. దీనికి తోడు కొత్త‌ రుచులు చూడాల‌న్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో డ్రగ్స్, మద్యం తర్వాత ఇక తర్వాత పీక్ స్టేజ్‌కు చేరుతున్నాయి పార్టీలు. అందమైన అమ్మాయిల్ని బుక్ చేసుకొని.. పార్టీలో వారి చేత అర్థనగ్నంగా.. నగ్నంగా డ్యాన్సులు చేయిస్తూ మత్తులో జోగుతున్నారు.

 

భారీ రెస్టారెంట్ లేదా బార్‌. పుట్టిన‌రోజైనా.. కాలేజీ ఫంక్ష‌నైనా.. మ‌రేదైనా.. అన్నీ అక్క‌డే. ఇక‌, ప‌బ్బుల‌కు క్యూక‌డుతున్న యువ‌త కూడా ఈ మ‌ధ్య‌కాలంలో మ‌న‌కు క‌నిపిస్తున్నారు. ప‌బ్బులు, పార్టీలు,  వీకెండ్ పార్టీలు ఇవే న‌డుస్తున్నాయి.. ప్ర‌తి వారంతంలోనూ పార్టీల‌కు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ట్రెండ్ మారింది. ఒక‌ప్పుడు పార్టీ అంటే చ‌క్క‌గా స్నేహితుల‌ను పిలుచుకుని ఇంట్లో అమ్మ‌తో ర‌క ర‌కాల వంట‌లు వండించుకుని స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూ ఆనందంగా తింటూ ఎంజాయ్ చేసే రోజులు పోయాయ‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: