నిన్న మనం ఈతరం కుటుంబం గురించి మాట్లాడుకున్నాం.. ఈతరం కుటుంబంలో ఆత్త కోడళ్ల బంధం, అన్నదమ్ముల బంధం.. అమ్మానాన్నల బంధం, తల్లీకొడుకుల బంధం, తండ్రి కూతుర్ల బంధం గురించి మనం మాట్లాడుకున్నాం. అలాంటి బంధం గురించి మాట్లాడుకున్న మనం ఇప్పుడు ఆ బంధాల ఎఫెక్ట్ ఈ తరం యువతపై ఎంతమాత్రం పడింది అనేది చూద్దాం. 

 

ఒకప్పుడు అంత ఉమ్మడి కుటుంబంగా ఉండేది.. మూడు నాలుగు కుటుంబంలో యువతలో ఎవడో ఒకడే డబ్బుని నీళ్లలాగా ఖర్చు పెట్టేవాడు.. మిగితా అందరూ బుద్ధిమంతుల్లా ఉండేవారు. కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబం లేదు.. అందుకే సపరేట్ ఉన్న నాలుగు కుటుంబాలల కుటుంబానికి ఒక్కడు చిల్లర వెధవగా మారారు. 

 

తల్లి తండ్రులు ఎంత జాగ్రత్తగా పెంచిన సరే.. స్కూల్స్, కాలేజెస్ లో పక్కపిల్లలను చూసి ఆడంబరాలకు పోయి తల్లితండ్రుల జోబులు మాయం అయ్యేలా డబ్బుని దుబారా ఖర్చులు చేస్తున్నారు ఈ తరం యువత. ఒకరు కాదు ఇద్దరు కాదు.. యువత అంత అలానే.. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలు ఇవి మరి ఎక్కువగా చేస్తున్నారు. 

 

చేతిలో ఉన్న‌ డ‌బ్బును ఆచి తూచి ఖ‌ర్చు పెట్టుకునే యువ‌త ఈ తరంలో భూత‌ద్దం పెట్టి వెతికినా సరే క‌నిపించ‌దు. మ‌నీ అంటే మంచినీళ్లే.. అవ‌స‌రం ఉన్నా లేకున్నా.. ప‌క్కవారికి ఎంత మాత్ర‌మూ తీసిపోని విధంగా జీవించేయాల్సిందే.. ఎంతైనా ఖ‌ర్చు చేయాల్సిందే.. అన్నట్టు యువత తయారయ్యింది. ఈ తరం యువతకు మనీ వర్సెస్ మంచి నీళ్లలా తయారయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: