ప్రాణాంతకమైన హెచ్ఐవి వ్యాధి గురించి ఇప్పుడిప్పుడే ప్రజలకు అవగాహన వస్తున్నా ఇప్పుడు మాట్లాడుకోబోయేటువంటి కొంతమంది దుర్మార్గులు వల్ల ఎంతోమంది చాలా దురదృష్టవశాత్తు వ్యాధి బారిన పడుతుంటారు. వివరాల్లోకి వస్తే తనకు వచ్చిన మాయదారి రోగం ని దాచి పెట్టి తన భార్య జీవితాన్ని నాశనం చేశాడు ఒక దుర్మార్గపు భర్త. చివరికి నిజం తెలుసుకొని భాగ్యురాలు ఆమె భర్త నిలదీస్తే అతను తప్పు ఆమె వైపే ఉంది అని ప్లేటు ఫిరాయించాడు. అత్తమామలు కూడా కోడలు వల్లే తమ కొడుకుకు ఎయిడ్స్ వచ్చిందని నింద ఆమె వైపు తిప్పి వేశారు.

 

థానే జిల్లా లోని డోంబివిలి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2016 లో అతను ఒక యువతిని వివాహం చేసుకోగా అతనికి ఉన్న చెడు అలవాట్లు కారణంగా పెళ్లికి ముందు అతనికి హెచ్ఐవి వ్యాధి సోకింది. విషయం అతడితో పాటు తల్లిదండ్రులకు కూడా తెలిసి కూడా యువతి జీవితాన్ని నాశనం చేశారు. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత వారి ఇంటికొచ్చిన బంధువు ఒకరు మందులు సక్రమంగా వాడుతున్నావా.. అంటూ అతడిని అడగడంతో భార్యకు అనుమానం వచ్చింది

 

దీంతో విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకోగా ఆమెకు హెచ్‌ఐవీ పాజిటివ్ అని వచ్చింది. అత్త మామలేమో చేయని తప్పుకు ఆమె ను నిందిస్తున్నారు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తరువాత బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: