ప్రజలందరూ జనవరి 14వ తారీఖున భోగి పండగను జరుపుకోనున్నారు. అయితే భోగి పండగను ఎలా జరుపుకోవాలి అసలు భోగి పండుగ లో ఎటువంటి ఆచారాలను పాటించాలో ఈ ఆర్టికల్ లో మేము చెప్పబోతున్నాం


సూర్యనారాయణ మూర్తి ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే ముందురోజునే భోగి పండుగ అంటారు. అయితే, పంటలను బాగా పండించి.. ఎక్కువ దిగుబడి చేసిన రైతుల ఇళ్ళల్లో ధనలక్ష్మి తో పాటు ధాన్యలక్ష్మి తిరుగుతుంటారని ప్రజల విశ్వాసం. అందుకే రైతులు ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుతారు. భోగి రోజు ప్రారంభం అవ్వగానే నాలుగు వీధుల మధ్య ఉన్నటువంటి కూడలిలో భోగి మంటలను స్టార్ట్ చేసి పండగను ప్రారంభిస్తారు. భోగిమంటల్లో ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను కాల్చేస్తారు. అయితే ప్రజలు భోగి మంటలతో చలిపులిని తరిమి కొట్టడమే కాకుండా వాళ్లలో ఉన్నటువంటి అనేక సమస్యలను పారద్రోలి, కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఒక నమ్మకం.


అలాగే భోగి పండుగ రోజు సాయంత్రం వేళ ఇంటిలో బొమ్మల కొలువును ఏర్పాటు చేసి పిల్లలకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తారు పెద్దలు. అదేవిధంగా పిల్లల తల్లులు పేరంటాన్ని నిర్వహించి పసుపు కుంకుమలను ఇరుగుపొరుగు వాళ్ళకి ఇస్తుంటారు. అయితే దానికి బదులుగా ఇరుగుపొరుగు వాళ్ళు పిల్లల తలలపై రేగిపండ్లు, పువ్వులను.. దార లాగా వారి చేతుల నుండి పోస్తుంటారు. ఆ తర్వాత ఆ పిల్లలు నూరేళ్ళ పాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవించాలని ఆశీర్వదించి వెళ్ళిపోతారు.


అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే... భోగి మంటల్లో 3 వస్తువులను వేస్తే మీకు పట్టిన దరిద్రం వదిలి కోటీశ్వరులు అవుతారు అనే విషయం తెలుసా? తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి. చాలామంది వారి తెగిపోయిన చెప్పులను ఇంట్లోనే ఉంచుకుంటారు. అయితే ఆల్రెడీ చెప్పులంటేనే దరిద్రమని ఎంతో మంది భావిస్తూ ఉంటారు కాబట్టి వీటిని భోగిమంటల్లో వేస్తే మీకు పట్టిన దరిద్రం పరార్ అవుతుందని పెద్దలు సూచిస్తుంటారు. రెండవది ఏంటంటే.. మీ ఇంటి ఆవరణలో రాలిపోయిన, ఇంకా ఎండిపోయిన చెట్ల యొక్క ఆకులు, కొమ్మలు. పచ్చగా ఉండాల్సిన చెట్టు కొమ్మలు ఉండిపోయి ఉంటే అది చెడు శక్తి అని మనం భావించాలి. అందుకే వీటిని మంటల్లో వేస్తే మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇక చివరిది అయిన మూడవ వస్తువు ఏంటంటే నీటి కుండ. నీటి కుండ ఏ ఇంట్లో అయితే భోగి మంటల్లో కాలిపోతుందో ఆ ఇంట ఈ సంవత్సర కాలం పాటు అంతా శుభమే జరుగుతుందని పండితులు చెబుతుంటారు. ఆ కుండ లో ఉన్నటువంటి నీటిని పండగ రోజు చేసేటటువంటి తలస్నానానికి ఉపయోగించమని చెబుతారు పెద్దలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: