తెలుగు పండుగలలో సంక్రాంతి చాలా ముఖ్యమైనదిగా చెబుతుంటారు పెద్దలు. ప్రజలంతా తమ సొంత ఇంటికి వెళ్ళిపోయి కుటుంబ సభ్యులతో, చిన్ననాటి మిత్రులతో ఈ పవిత్రమైన రోజులను ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతుంటారు. అయితే ఈ ఆర్టికల్లో సంక్రాంతి పండుగ గురించి కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం.

 

సంక్రాంతి అంటే సంక్రమణం అని కూడా పిలుస్తుంటారు. అయితే ప్రతి ఏడాదిలో పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. కానీ సూర్యుడు ఎప్పుడైతే ధను రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దాన్నే మకర సంక్రాంతిగా అని పిలుస్తారు. అయితే ఇది అన్ని సంక్రాంతిలలో కంటే చాలా విశిష్టమైనది, పవిత్రమైనది. ఈ మకర సంక్రాంతి జనవరి నెలలో రాగా... ఈ పండుగ సందర్భంగా స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మకర సంక్రాంతి రోజున ఎవరైనా తమ ప్రాణాలను పోగొట్టుకుంటే వారికి పునర్జన్మ ఉండదని.. వాళ్లు నేరుగా స్వర్గానికి వెళతారని పండితులు చెబుతారు. 

 

అలాగే ఈ పండుగ రోజున సూర్యుడు తన కుమారుడైన శనిదేవుడిని కలుస్తారు. అదేవిధంగా సూర్యుడు తన కోపం మొత్తం మర్చిపోయి చాలా సంతోషంగా చాలా శాంతంగా తన కుమారుడైన శని దేవుడి తో గడుపుతాడు. అందుకే ఈ పండుగ రోజున స్వీట్లను పంచుకోమని పండితులు చెబుతారు. 

 

పండుగ శీతాకాలంలో రావడం వలన.. ఒంటిలో వేడి పుట్టించే నవ్వులతో తయారు చేసిన పిండి పదార్థాలను తీసుకోమని సూచిస్తారు పెద్దలు. అదేవిధంగా ఈ పండుగ రోజున గాలి పటాలను ఎగుర వేస్తుంటారు ప్రజలు. గాలిపటాలను కేవలం ఎండ వచ్చే టైంలోనే ఎగరవేయటం వలన... సూర్య కాంతి వారి పై పడి వారిలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా చచ్చిపోయి మనసు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా తయారవుతుంది. అలాగే స్కిన్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. అందుకే ఈ పండుగ రోజున ఈ సాంప్రదాయాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. అలాగే మకర సంక్రాంతి రోజున కేరళలో అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తారు. భక్తులంతా తమ పాపాలను తొలగించుకోవడానికి పవిత్రమైన నదులలో మునుగుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: