సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చినటువంటి సంక్రాంతిని మకర సంక్రాంతి అంటారు. ఈ సంక్రాంతి అన్ని సంక్రాంతిల కంటే చాలా పవిత్రమైనదని పురాణాలూ చెబుతున్నాయి. త్వరలోనే జరుపుకోనున్న ఈ పండుగ హుడాహుడి ఇప్పటికే ప్రారంభమయింది. ఒకవైపు ఎడ్ల, కోళ్ల పందాలు జోరుగా సాగుతుండగా, మరొక వైపు వనితామణులందరు ముగ్గులని, పిండివంటలని, ఇంకా కొన్ని ముఖ్య కార్యక్రమాలను చకచకా పూర్తిచేస్తున్నారు. అయితే, పండగ ఎంత గొప్పగా జరుపుకున్నా కొన్ని విషయాలను తెలుసుకోకపోతే మీరనుకున్నంత ఫలితం దక్కదు. ఆ కొన్ని విషయాల్లో ఒక ముఖ్యమైన విషయం మేము ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేయబోతున్నాం.


చాలామంది కొన్ని పాత వస్తువులని ఎప్పుడైనా పనికివస్తాయేమోనని ఇంటిలోనే ఉంచుకుంటారు. అయితే, వీటివల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కువగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. మీ ఇంట్లో పాత క్యాలెండర్లు, పాత శుభలేఖలు, గ్రీటింగ్ కార్డ్స్ ఉంటె వాటిని ఒక సంచిలో వేసి వెంటనే డస్ట్ బిన్ లో పడేయండి. అలాగే, మీ పిల్లల పాత బొమ్మలు పగిలిపోయినట్లైతే వాటిని కూడా మీ ఇంటినుండి బయటకు పడేయండి. చిరిగిపోయిన బట్టలు, పాత గడియారాలు, పగిలిపోయిన అద్దాలు ఎవరింట్లో అయితే ఉంటాయో వారి ఇంట్లో జేష్ఠ దేవి కొలువుంటుంది. దాంతో మీరు ఎంత కష్టపడినా డబ్బులు సంపాదించినా అవి మాత్రం మీరు నిలబెట్టుకోలేని స్థితి ఎల్లప్పుడూ వస్తుంది.


అలాగే, మీ పిల్లల మాణికట్టులకు కట్టేటటువంటి తాడులను, ఇంకా మీ మొలతాడులను మార్చి కొత్తవి కట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు. మీ ఇంట్లో కారిపోతున్న నీటి ట్యాపులు ఉన్నా, గోడలు బీటలు వారిన, ఇంటి పైకప్పు కి రంధ్రాలు ఉన్నా వాటిని వెంటనే రిపేర్ చేయించండి. అయితే, ఈ వస్తువులన్నిటిని సంక్రాంతి లోపే బయటపడేస్తే నెగటివ్ ఎనర్జీ పరారయ్యి మీరు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఆలస్యమెందుకు పండితులు చెప్పనటువంటి మంచిని పాటించి ధనికులవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: