తెలుగు వారు పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ ను మన తెలుగు వాళ్ళు దేశ విదేశాల్లో ఎక్కడున్నప్పటికి ప్రతీ సంవత్సరం తప్పకుండా జరుపుకుంటారు. సంవత్సరం మొత్తం లో వచ్చే మొదటి పండుగ కావడంతో తెలుగు ప్రజలందరు ఉత్సాహభరితంగా సంక్రాంతిని ఎంతో గొప్పగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి. ఇక సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి దీనిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాము. సంక్రాంతి పండుగ ప్రతీ ఏడాది జనవరి 14 లేదా 15 వ తేది ల్లో వస్తుంది. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి అని సంక్రాంతి తరువాత వచ్చే పండుగ కనుమ అని తర తరాలుగా మన తెలుగు వాళ్ళు జరుపుకుంటున్నారు.

 

ఇక ఈ సంక్రాంతి పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనప్పటికి చాలా పవిత్రంగా జరుపుకుంటారు. సంక్రాంతిని ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ ,కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అని తమిళనాడులో పొంగల్ , పంజాబ్ లో లోహిరి, రాజస్థాన్.. గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరయన్ అని పిలుస్తారు. ఈ పండుగని కేవలం మన దేశంలోనే కాక మన పొరుగు దేశాలైనటువంటి భర్మ, నేపాల్, థాయిలాండ్ దేశాల్లో కూడా జరుపుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నెల రోజుల ముందునుండే పండగ హడావిడి మొదలవుతుంది. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు , గొబ్బమలతో స్వాగతం పలుకుతాయి. వేకువ జామున హరినామ సంకిర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మల్లిస్తాడు. గంగిరెద్దులు , కోడి పందాలు , ఎడ్ల పందాలతో ఊళ్ళన్ని మహా సందడిగా మారిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది.

 

ఇంటిల్లపాది మిగతా నెలల్లో ఎక్కడున్నప్పటికి ఈ సంక్రాంతి పండుగ సమయానికి ఇళ్ళల్లో వాలిపోతారు. పిండివంటల తయారికి పండుగకు పది రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. అరిసెలు ,పాకుండలు ,సకినాలు ,మిటాయిలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు. ఈ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికస్తుంది. అందుకే అందరిళ్ళలో ధనం ధాన్యం నిండి ఉంటాయి. అంతేకాదు ఈ పండగకి ఏమాత్రం ఖర్చుకి వెనకాడకుండా కావలసినవన్నీ సమకూర్చుకుంటారు. ఇంట్లో వున్నా ప్రతి ఒక్కరు కొత్త బట్టలు కొనుక్కుంటారు. అలాగే సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తాం ..అందుకే దీనిని గాలిపటాల పండుగ అని కూడా అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: