నేటి మంచిమాట.. ఎదుటివారిని కించపరిచే విధంగా మాట్లాడకండి. మనం మనుషులం.. కానీ మనుషులలా బతకడం లేదు.. మనిషి కంటే జంతువులు నయం అనిపిస్తుంది. ఎందుకు అంటే.. మనిషికి స్వార్థం ఎక్కువ అయిపోయింది. మనిషి అంటేనే స్వార్థం. చిన్న విషయంలో ఒక్కసారి గెలిస్తే చాలు ఓడిన వారిపై తక్కువ చూపు చూస్తారు. 

 

అంతేకాదు.. మాట దొర్లుతారు కూడా.. ఎదుటివారిని కించపరుస్తారు కూడా.. మనుషులను కించపరుస్తారు. ఆలా కించపరచడం ఎంతవరుకు న్యాయం. ఈరోజు గెలుపు రేపు ఓటమి కావచ్చు.. ఈరోజు ఓటమి రేపు గెలుపుకోవచ్చు. అందుకే ఆలా ఎదుటువారిని కించపరిచే విధంగా మాట్లాడకండి!

 

అందుకే ఎవరిని కించపరచకండి.. ఎప్పుడు ఎవరు రాజు అవుతారో.. ఎప్పుడు ఎవరు బానిస అవుతారో ఊహించలేం.. మనిషి ఆస్తిపాస్తులు.. గెలుపు.. ఓటమి.. కాదు... మనిషికి ఇవ్వాల్సిన విలువ మనం ఇవ్వాలి. అప్పుడే మనం మనుషులం అవుతాం. ఎట్టి పరిస్థితుల్లోను మనిషిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు.. అది మంచి పద్ధతి. 

మరింత సమాచారం తెలుసుకోండి: