శృంగారం అనేది ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. శరీరం, మనసు ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండేందుకు తోడ్పడే ఓ ఔషధం ఇది. సెక్స్ అంటే కేవలం శారీరకంగా, యాంత్రికంగా చేసే ప్రక్రియ మాత్రమే కాదు. మనస్ఫూర్తిగా శృంగారంలో పాల్గొంటే దాని ద్వారా.. ఎన్నో ప్రయోజనాలు పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు అంటున్నారు. ఇక ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా జంటలకు ఏకాంతంగా గడిపేందుకు బోలెడంత సమయం దొరికింది. దీంతో రోజంతా తిరికలేకుండా ఫుల్‌గా ఎంజాయ్ చేసే అవకాశం దక్కింది. 

 

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. సాధార‌ణంగా చాలా మంది పగలు కంటే రాత్రి వేళల్లోనే సెక్స్ చేయడానికి ఆసక్తి చూపుతారు. అది కూడా రాత్రి శుభ్రంగా భోజనం చేసిన తర్వాత నిద్రకు సిద్ధమవుతున్న సమయంలో రొమాన్స్ మొదలుపెడతారు. ఎందుకంటే.. భోజనం చేసిన తర్వాత శరీరానికి బోలెడంత శక్తి వస్తుందని, అది సెక్స్ చేసేందుకు శక్తిని ఇస్తుందని భావిస్తారు. అయితే వాస్త‌వానికి ఇలా చేయడం వల్ల నష్టమే తప్ప.. లాభం ఉండదని హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే సెక్స్ చేయడం వల్ల కడుపులో మంట ఏర్పడుతుందని, అది క్రమేనా అసిడిటీకి దారి తీయవచ్చని చెబుతున్నారు నిపుణులు. 

 

అందుకే భోజనానికి.. సెక్స్‌కు మధ్యం కనీసం రెండు గంటల గ్యాప్ ఉంటే మంచిది. ఇలా చేస్తే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు అని చెబుతున్నారు వైద్యులు. ఇక వాస్త‌వానికి సెక్స్ చేయాలనే మూడ్ వస్తే.. కొందరు ముహూర్తాలను కూడా చూసుకోరు. అయితే, కొన్ని సమయాలను ఖచ్చితంగా పాటిస్తే తప్పకుండా మంచి సెక్స్‌ను ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఉదయం అల్పాహారానికి ముందే సెక్స్‌లో పాల్గోవడం ఉత్తమం. ఆ స‌మ‌యంలో స్త్రీలు ఉద‌యం 8 నుంచి 10 కి ఉద్వేగంలో ఉంటారు. అలాంటి టైమ్‌లో వారితో సెక్స్ చేస్తే రసవత్తరంగా సాగుతుందట. మ‌రియు తెల్లవారుజాము 5 గంటల నుంచి 8 గంటల లోపు శృంగారంలో పాల్గొన్న బాగా ఎంజాయ్ చేస్తార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: