పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటే వింటూనే ఉంటాం. ఇక పిల్ల‌ల‌కు మాత్రం పెళ్లి అంటే అదో పెద్ద పండగ. ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి కుటుంబ సభ్యులు బంధు మిత్రుల మధ్య ఘనంగా జరిగే వేడుక. బాజా భజంత్రీలు, పండితుల పవిత్రమంత్రాల మధ్య రెండు మనసులు ఒక్కటయ్యే వేడుక. అయితే ఒకప్పుడు పెళ్లి కోసం పురుషుడు ముందు అమ్మాయిని చూసుకునేవాడు. కానీ ప్రస్తుతం అభివృద్ధి చెందిన, చెందుతున్న 70 శాతం వర్గాలలో ముందు అమ్మాయి తల్లిదండ్రులు పిల్లవాడిని చూసుకుంటున్నారు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. మ్యారేజ్, లైఫ్ పార్టనర్ ఎంపిక విషయంలో ప్రతీఒక్కరికీ ఖచ్చితమైన స్పష్టత ఉండాలి.

 

ముఖ్యంగా పెళ్లికి ముందు మీకు కాబోయే లైఫ్ పార్ట‌న‌ర్‌లో ఖ‌చ్చితంగా కొన్ని విష‌యాలు గ‌మ‌నించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పెళ్లి బంధం అనేది గొప్ప అనుబంధం. ఇది జీవితాంతం మనకి భరోసానివ్వాలి. లాంటి బంధాన్ని అపురూపంగా మలుచుకోవాలంటే మన జీవిత భాగస్వామి మనకి గొప్ప స్నేహితుడిగా ఉండాలి. కాబట్టి మీ పార్టనర్‌కి స్నేహం చేసే గుణాలు ఉన్నాయో లేవో చూడండి. అలాగే మనకి కాబోయే లైఫ్ పార్టనర్‌ నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. ప్రతీ ఒక్క విషయంలో తాను ఖచ్చితమైన నిర్ణయాలు కలిగి ఉండాలి. ముఖ్యంగా ముక్కుసూటితనం ఉండాలి. 

 

ఏ విష‌యాన్ని అయినా ధైర్యంగా చెప్ప‌గ‌ల‌గాలి. ఇలా చెప్పే గుణం మీరు కోరుకునేవారికి ఉందో లేదో తెలుసుకోండి. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు.. ఎప్పుడు నిజాయితీగా ఉంటారు. ఇలాంటివారితో మీ బంధాన్ని ఎంతో హాయిగా కొన‌సాగుతుంది. ఇలా ఉన్నప్పుడే మీ వివాహ బంధం అద్భుత కావ్యంగా మారుతుంది. అదేవిధంగా.. ఏ బంధమైనా ఎక్కువకాలం నిలవాలంటే నమ్మకం అనేది చాలా ముఖ్యం. అందుకే మీ బంధాన్ని పదిలపరుచుకోవాలంటే లైఫ్ పార్టనర్ ఎంపికలో అన్నీ విషయాలు ఆచితూచి వ్యవహారించాలి. ముఖ్యంగా మీ అభిప్రాయాలు నచ్చేవారు, వాటికి విలువనిచ్చేవారి గురించి తెలుసుకుని అలాంటి వారిని ఎంపిక చేసుకోవడం వ‌ల్ల మీ లైఫ్ హ్యాపీగా కొన‌సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: