క‌రోనా వైర‌స్‌.. ఈ పేరు వింటేనే ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో వ‌ణికిపోతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌.. అన‌తి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించి ల‌క్ష‌ల ప్రాణాల‌ను పొట్ట‌న‌పెట్టుకుంటోంది. మూడక్షరాల కరోనా ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. అయితే వ్యాక్సిన్ లేని క‌రోనా కంట్రోల్ చేయటం కష్టమా? అంటే కాదనే చెప్పాలి. అలాంటప్పుడు ఇంత ఆగం ఎందుకంటే? దీనికున్న పరిమితులే కారణం. ఇక జాగ్రత్తలు తీసుకుంటే అది మన జోలికి రాదంటున్నారు. ఒకవేళ వచ్చినా ఏమీ కాదంటున్నారు సైకాలజిస్టులు. ఈ క్ర‌మంలోనే కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తున్నారు.

 

ఈ క్ర‌మంలోనే  ప్రతీ ఒక్కరూ పాజిటివ్‌గా ఉండాలంటున్నారు. ఎందుకంటే.. ఎన్ని మందులు వాడినా తగ్గని రోగాలు సంతోషంతో, పాజిటివ్ ఎనర్జీతో ఉంటే తగ్గుతున్నాయనీ, ఇదే ఫార్ములా కరోనా వైరస్‌కి కూడా వ‌ర్తిస్తుంద‌ని అంటున్నారు. ఇక ఎల్ల‌ప్పుడూ హ్యాపీగా, పాజిటివ్‌గా ఉండ‌డం వ‌ల్ల‌ మన బాడీలో కణాలన్నీ ఉత్తేజంతో ఉంటాయి. మ‌రియు బాడీలోని మంచి బ్యాక్టీరియా కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలో ఒక‌వైళ కరోనా వైరస్ బాడీలోకి వెళ్తే... మంచి బ్యాక్టీరియా బలంగా పోరాడి వైరస్‌ను నాశానం చేస్తుంది.

 

అలాగే కరోనా న్యూస్ టీవీల్లో అతిగా చూడొద్దు. జస్ట్ అప్‌డేట్స్ తెలుసుకొని... వేరే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ చూడండి. ఎందుకంటే.. క‌రోనా గురించి భ‌యంక‌ర‌ విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఇది ప్రజ‌ల్లో మ‌రింత భ‌యాన్ని నిపేస్తుంది.  ఇక యోగా, ఎక్సర్‌సైజ్ వంటివి చేస్తే... ఫిట్‌నెస్ పెరుగుతుంది. అదే స‌మ‌యంలో బాడీలోని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబ‌ట్టి.. క్ర‌మం త‌ప్పకుండా యోగా, ఎక్సర్‌సైజ్ వంటివి చేయాలి. మ‌రియు కరోనా నెగెటివ్ వార్తల్ని పట్టించుకోవద్దు. ముఖ్యంగా కరోనాపై ఎవరైనా భయంకరంగా చెబితే... అస్సలు ఆస‌క్తిచూప‌వ‌ద్దు. ఎందుకంటే క‌రోనా విష‌యంలో అప్రమత్తంగా ఉండాలి తప్ప భయం ఉండ‌కూడ‌దు. ఇది మ‌న మాన‌సిక ఆరోగ్యానికి క్షీణించేలా చేస్తుంది. ఇక‌ ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం అస్స‌లు మ‌ర‌చిపోవ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: