ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేస‌లు రోజురోజుకు భారీ స్థాయిలో పెరుగుతున్నాయే త‌ప్పా.. త‌గ్గ‌డం లేదు. ఈ క‌రోనా భూతాన్ని అరికట్టేందుకు ప్రపంచదేశాలు దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ..  వైరస్ తీవ్రతలో ఎలాంటి మార్పూ కనిపించట్లేదు. ఈ క్ర‌మంలోనే పెరుగుతున్న కేసులతో అన్ని దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నా క‌రోనా మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఇప్ప‌టికే క‌రోనా వైరస్ బాధితుల సంఖ్య 91 లక్షలు దాటిపోయింది.

 

అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారి మాన‌వ మ‌నుగ‌డ‌కే పెద్ద గండంగా మారింది. అమెరికా, బ్రెజిల్, స్పెయిన్,బ్రిటన్, రష్యా దేశాల్లో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. అయితే మ‌రోవైపు.. క‌రోనాకు వ్యాక్సిన్ లేకుపోవ‌డంతో.. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు,సూచనలు చేస్తున్నాయి. ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వెంట‌నే ఏం చేయాలి..? అన్న‌ది చాలా మంది నిపుణుల‌ను అడుగుతున్న ప్ర‌శ్న‌. 

 

ఒక‌వేళ మీకు లేదా మీ ఇంట్లో ఎవ‌రికైనా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. బాడీలో టెంపరేచర్‌ను ధెర్మోమీటర్‌తో రోజుకు రెండుసార్లు చెక్ చేసుకోవాలి. 100.4 డిగ్రీల ఫారన్ హీట్ (38 డిగ్రీల సెల్సియస్) ఉంటే... డాక్టర్‌కి కాల్ చెయ్యాలి. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్‌ వచ్చాక... ముఖానికి మాస్క్ పెట్టుకొని మాత్రమే డాక్టర్‌ని కలవాలి. అనంత‌రం మీ ప‌రిస్థితిని బ‌ట్టీ డాక్ట‌ర్లే ఏం చేయ్యాలి అన్న‌వి చెబుతారు. అలాగే కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఉండే గదిని రోజూ సబ్బు నీటితో శుభ్రం చెయ్యాలి. ఆ గదిలోని ప్రతీ వస్తువునూ రోజూ శుభ్రం చెయ్యాలి. కరోనా లక్షణాలు ఉండే వ్యక్తికి ఏది ఇచ్చినా... మన చేతులకు హ్యాండ్ శానిటైజర్ రాసుకుని, ముఖానికి మాస్క్ తొడుక్కొని మాత్రమే ఇవ్వాలి. ఆ గది తలుపులు మూసివేసి ఉంచాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: