ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజురోజుకు క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారిన ఈ క‌రోనా భూతాన్ని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచంలోని అన్ని దేశాల శాస్త్ర‌వేత్త‌లు తీవ్ర ప్ర‌యత్నాలు చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ త‌గిన ఫ‌లితం ద‌క్క‌డం లేదు. ఇదే క్ర‌మంలోనే రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మ‌ర‌ణాల సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ.. ల‌క్ష‌లాది మంది ప్రాణాలను హరించివేస్తున్న క‌రోనా నుంచి ర‌క్షించుకోవ‌డం చాలా ముఖ్యం.

 

అందుకే వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఎప్ప‌టిక‌ప్పుడు కీలక సలహాలు, సూచనలు చేస్తున్నాయి. అయితే రోగనిరోధక శక్తి మెరుగుపడిన తర్వాత కరోనాతో పోరాడటం సులభం అవుతుంద‌ని అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా జింక్ తప్పనిసరిగా ఆహారంలో చేర్చాల‌ని సూచిస్తున్నారు. ఎందుకంటే.. జింక్  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, శరీర గాయాలను నయం చేయడం, కణాల పెరుగుదల ఇలా మూడు వంద‌ల‌కి పైగా ఎంజైమ్‌ల కార్యకలాపాల్లో జింక్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

 

మ‌రి శ‌రీరంలో జింక్ పెంపొందించాలంటే.. పాలు, పెరుగు ఖ‌చ్చితంగా తీసుకోవాలి. జింక్ మూలంగా పాలు మరియు పెరుగు చాలా ప్రయోజనకరమైన ఆహారాలలో ఒకటి. జీడిపప్పులో కూడా జింక్ పుష్క‌లంగా ఉంటుంది. జీడిపప్పు మాత్రమే కాదు, మీరు బాదం మరియు ఇతర గింజలను తినవచ్చు. ఇక చాలా మంది అల్పాహారం కోసం వోట్స్ తింటారు. ఇది జింక్ కు మంచి మూలం. రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఆహారంలో ఓట్స్ జోడించండి. చికెన్ మ‌రియు మ‌ట‌న్‌లో కూడా జింక్ ఉంటుంది. కాబట్టి మీరు వారానికి ఒకసారి చికెన్ లేదా మ‌ట‌న్‌ తినవచ్చు. అయితే, ఎక్కువగా తినవద్దు, ఎందుకంటే మాంసం కొలెస్ట్రాల్ మరియు కొవ్వు ఎక్కువగా ఉంటుంది. మ‌రియు బఠానీలు, వివిధ పప్పుధాన్యాలు, బీన్స్, గోధుమలు జింక్‌కు మంచి వనరులు. రోగనిరోధక శక్తిని పెంచడానికి రోజూ వీటిని డైట్‌లో చేర్చుకోండి.
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: