ఈ మూడు విషయాలలో జాగ్రతగా ఉండు!
1. నిన్ను నీవు పొగడుకొనుట
2. పరనింద
3.పరుల దోషాలను ఎంచుట

ఈ మూడింటిని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో!
1. ఈశ్వర స్మరణ
2.పరులను గౌరవించుట
3.నీలోని దోషాలను కనిపెట్టుట

ఈ మూడింటిని ఆచరించు!
1. సత్యము
2.అహింస
3.ప్రేమ తత్త్వము

ఈ మూడింటికి దూరంగా ఉండు!
1.ఇతరులగురించి చర్చ
2.వాద వివాదాలు
3.నాయకత్వం

ఈ మూడింటి పట్ల దయతో ఉండు!
1.అబల
2.పిచ్చి వాడు
3.దారి తప్పిన వాడు

ఈ మూడింటి పట్ల దయతలచ వద్దు
1. పాపము
2. బద్దకము
3.స్వేచ్చా ప్రవర్తన

ఈ మూడింటిని వశము నందు ఉంచుకో!
1.మనసు
2.కామేంద్రియము
3.నాలుక

ఈ మూడింటి పట్ల మమకారం కలిగి ఉండు!
1.ఈశ్వరుడు
2.సదాచారము
3.పేదలు

ఈ ముగ్గురి పట్ల వినయం కలిగి ఉండు!
1.తల్లి
2.తండ్రి
3.గురువు

ఈ మూడింటిని హృదయము యందు ఉంచుకో!
1.దయ
2.క్షమ
3.వినయము

ఈ మూడు వ్రతాలు పాటించు!
1.పరస్త్రీని మోహించ కుండుట
2.పర ధనము పట్ల ఆసక్తి లేకుండుట
3. అసహయులకు సేవ చేయుట

ఈ ముగ్గురిని పోషించడం నీ కర్తవ్యం!
1. తల్లిదండ్రులు
2.భార్య బిడ్డలు
3.దుఖములో ఉన్నవారు

ఈ ముగ్గురి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపు!
1.వితంతువు
2.అనాధలు
3.నిరాధారులు

ఈ మూడింటిని లెక్క చేయవద్దు !
1.ధర్మాన్ని పాటించే సమయంలో కలిగే కష్టాన్ని
2.పరుల కష్టాన్ని తొలగించేటప్పుడు కలిగే ధన నష్టాన్ని
3.రోగికి సేవ చేయునప్పుడు శరీరానికి కలిగే కష్టాన్ని

ఈ మూడింటిని మరిచిపో!
1. నీవు ఇతరులకు చేసిన సాయం
2. ఇతరులు నీకు చేసిన కీడు
3.డబ్బు , గౌరవం , సాధనల వల్ల సమాజంలో నీకు కలిగిన ఉన్నత స్థితి.

ఈ మూడు విధాలుగా మారకు!
1. కృతగ్నుడు
2. డాంబికుడు
3. నాస్తికుడు.     

     ..కృష్ణార్పణమస్తు


మరింత సమాచారం తెలుసుకోండి: