పెళ్లికుమారుని గృహంలో గాని, కళ్యాణ మండపంల విడిదిలో గాని పురోహితులు ఈ స్నాతక కార్యక్రమము నిర్వహిస్తారు.  చదువు పూర్తి అయిన విద్యార్థికి గురు జరిపే ఉత్సవం ఇది. విఘ్నేశ్వర పూజతో అన్ని రకాల ప్రాయశ్చిత్తాల కోసం శరీర శుద్ది కోసం స్నాతక కార్యక్రమం వరునిచే పురోహితులు చేయిస్తారు.  ఎనిమిది సంవత్సరముల వయస్సులో బాలుడు ఉపనయన సంస్కారాన్ని పొంది విద్యాభ్యాసము కరకు గురుకులానికి వెళతాడు.

గురువుగారి వద్ద 12 సంవత్సరాలు విద్యాభ్యాసం పూర్తి చసి గురువుల అనుమతి పొంది గురుకులాన్ని విడిచి తన ింటికి తిరిగి వస్తాడు. తరువాత గృహస్థాశ్రమంలో ప్రవేశించటానికి అనుమతి పొంది స్నాతకం చేసుకోవాలి.  ఈ కార్యము సర్వ ప్రాయశ్చిత్తము కోసం శరీర శుద్ది కొరకు చేయబడే కార్యం. 
Related image
కావలసిన వస్తువులు:
పసుపు : 100 గ్రా.
కుంకుమ : 50 గ్రా.
వక్క : 100 గ్రా.
ఆకులు : 1 కట్ట
ఎండు ఖర్జూరాలు : 250 గ్రా.
పసుపు కొమ్ములు : 250 గ్రా.
కొబ్బరి కాయలు : 6
ఎండు కొబ్బరి గెన్నెలు : 9
సాంబ్రాణి కడ్డీలు : 1 ప్యాకెట్టు
కర్పూరము : 50 గ్రా.
గంధం పొడి : 1 డబ్బా
పండ్లు : 25
పూలు : 100 గ్రా.
కట్ల సంచి, బాషికాలు : 6
యాజ్జీవానికి రవికలు
యాజ్జీవానికి బియ్యం : 5 శేర్లు
బావమరిదికి నూతన వస్త్రములు
చిల్లర : 21 రూ.
రొక్కము : 51 రూ.
పీటల మీదకు తెల్లని వస్త్రము


మరింత సమాచారం తెలుసుకోండి: