మనిషి జీవితంలో కష్టాలను బాధలను అధిగమించడంలో రక్తసంబంధూలే శత్రువులుగా తయారవుతూ ప్రాణాలు తీస్తున్న రోజులలో బ్రతుకుతున్నాం మనం. అయితే ఎటువంటి సందర్భంలోనైనా మనిషి జీవితంలో తోడుగా నిలిచే బంధం ఏదైనా ఉందంటే అది స్నేహమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక వ్యక్తికి మంచి స్నేహితులుంటే అతని జీవితం అంధకారంలో ఉన్న ఎప్పటికైనా ఉన్నత శిఖరాలకు చేరుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మనిషి జీవితంలో అతి ప్రాముఖ్యమైన వివాహమన్నది... ప్రస్తుత సమాజంలో మూన్నాళ్ళ ముచ్చటగా నాలుగు నెలలకే దంపతులిద్దరూ విడిపోతున్న సందర్భాలు కోకొల్లలు. ఇటువంటి విషయాలు వార్తాపత్రికలలో టీవీ చానళ్లలో సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం.
Related image
అయితే స్నేహం విషయానికి వచ్చేసరికి వివాహ బంధానికి రివర్స్ గా ఉంటుంది. మనిషి జీవితాన్ని అంతా ప్రభావితం చేసే స్నేహం అనేది ఒక జాతికో ఒక కులానికో..ఒక రంగుకో...పేదవాడి కో ధనవంతుడికో మాత్రం పరిమితం కాలేదు. జీవితంలో మనిషి ఆస్వాదించే వాటిలో స్నేహం అన్నది అతి ప్రాముఖ్యమైనది. అలాంటి స్నేహానికి ప్రత్యేకంగా ఒక రోజు అవసరమా... అంటే అవసరమేనంటూ ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజును నిర్ణయించుకొని స్నేహితుల దినోత్సవాన్ని ఒక వేడుకలా జరుపుకుంటున్నారు.
Related image
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇదొక సాంప్రదాయంగా వస్తోంది.
Related image
ఇటువంటి స్నేహితుల దినోత్సవాన్ని అగ్రరాజ్యమైన అమెరికా 1935లో ఆదేశ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. స్నేహం ముసుగులో మోసాలు జరిగినా ఇబ్బందులు ఎదురు అయినా ఇతర బంధాలు లాగా వదులుకోకుండా , భయపడకుండా ఉండగల బంధం ఇదే. ఉదాహరణ కి పెళ్లి అనే బంధం వలన మనం ఇబ్బంది పడినా లేదా తలనొప్పులు ఎదురుకొన్నా , విడిపోయినా ఇంకొకరితో మళ్ళీ పెళ్లి బంధం లోకి అడుగు పెట్టడానికి భయపడతాం కానీ స్నేహం అనే విషయం లో అలా ఉండదు .. అదే స్నేహం యొక్క గొప్ప విషయం ..


మరింత సమాచారం తెలుసుకోండి: