పుట్టుకతో ఏర్పడే బంధాలు రక్తసంబంధాలు.. అవి ఏర్పడటంలో మన ప్రమేయం ఏమి ఉండదు. పుట్టగానే అమ్మానాన్న, అక్క, చెల్లి, తమ్ము, అన్న ఇలా అన్ని రిలేషన్స్ ఏర్పడతాయి. ఇవన్ని గాడ్స్ గిఫ్ట్ గా మనం స్వీకరించాల్సిందే. మనకు తెలిసి.. మనకు నచ్చిన రిలేషన్ ఏర్పరచుకోవడమే స్నేహం. 


స్నేహితుడి ఎంపికలో ఎవరి ప్రమేయం ఉండదు అది మన స్వతహాగా మన ఆలోచనలకు.. మన అభిరుచులకి నచ్చే వారే మన పక్కన చేరుతారు. అందుకే స్నేహితుడికి అంత ప్రాధాన్యత. మనకంటూ ఎలాంటి స్నేహితుడు కావాలి అని స్వతంత్రం స్నేహంలో ఉంటుంది.


ఇక నిజమైన స్నేహం.. నిజమైన స్నేహితుడు ఎవరు అనేది చెప్పడం చాలా కష్టం. కొందరు స్నేహితుల మేలు కోరి నడుచుకుంటారు. కొందరు అదే స్నేహితులను అవసరాలకు ఉపయోగించుకుంటారు. మనసుతో చేసే స్నేహం ఎప్పటికి నిలిచే ఉంటుంది. అలా కాకుండా అవసరాలకో.. అనాలోచనతో చేసే స్నేహం ఎన్నాళ్లో నడవదు. 


స్నేహం ఇలానే ఉండాలి అన్న పరిమితులు లేవు. కొందరు ఇంటి దాకా స్నేహితులను పిలుస్తారు. కొందరు హాల్ దాకే పరిమితం చేస్తారు. మరి కొందరు బెడ్ రూం లోకి కూడా స్వతంత్రంగా వస్తారు. ఇద్దరు స్నేహితులు ఒక్కటిగా ఆలోచించే స్వభావం ఉన్నప్పుడే వారి మధ్య స్నేహం గొప్పగా ఉంటుంది.


స్నేహంలో త్యాగం.. ప్రేమ రెండూ ఉంటాయి. ఎలాంటి స్నేహితుడైనా తప్పు చేసినా క్షమించే సద్గుణం ఉన్నప్పుడే కొందరి స్నేహుతులు కలిసి జీవిస్తారు. సృష్టిలో స్నేహం అనేది ఓ అద్భుతమైన బంధం.. అనిర్వచనేయమైన అనుబంధం.. బంధాలు.. బంధువులు ఉన్నా లేకున్నా స్నేహితుడు లేని మనిషి ఉండడని మాత్రం చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: