కేవ‌లం ఒకే ఒక‌ ద‌శాబ్దం. ప్రపంచంలో నంబ‌ర్ వ‌న్ అయ్యాడు. కేవ‌లం ఒకే ఒక్క ఆన్‌లైన్ ఐడియాతో ప్ర‌పంచ కుబేరుల‌ను వెన‌క్కినెట్టేశాడు. ప్ర‌పంచం ఆశ్చ‌ర్య‌పోయి చూసింది. ప్ర‌పంచ దిగ్గ‌జ‌ కంపెనీల‌న్నీ నివ్వెర‌పోయాయి. అక్క‌డ జ‌రుగుతోంది మాట‌ల‌కంద‌ని మ‌హా విజ‌యం. ఒక పాత గ్యారేజీలో చిన్న కంపెనీ పెట్టి, అది ఇంతింతై అన్నట్లుగా ఊహించ‌నంత వేగంగా ఎదిగి ఆన్‌లైన్‌ ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు. దాదాపు పది లక్షల కోట్ల ఆస్తితో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ సంపన్నుడి పీఠం ఎక్కేశాడు అమెజాన్ అధినేత‌ జెఫ్ బెజోస్. మరొకరెవరూ ఇప్పట్లో తనకు పోటీ రానంత ఎత్తులో నిలిచాడు. 

Related image

 ఫ్లాష్  బ్యాక్‌లోకి వెళితే...
ఒక్క ఏడాదిలోనే వెబ్‌ ప్రపంచం 2300 శాతం విస్తరించిందని చ‌దివిన‌ వార్త.. ఆయ‌న‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. అంత స్పీడ్‌గా డెవ‌ల‌ప్ అవుతున్న రంగంలోకి దిగాల్సిందే అని ఫిక్స‌య్యాడు. భార్య‌తో క‌లిసి ఆన్‌లైన్‌లో పుస్త‌కాలు అమ్మే బిజినెస్‌ను మొద‌లుపెట్టాడు.ఆ తర్వాత ఇతర వస్తువులకూ విస్తరిస్తే బాగుంటుందనుకున్నారు. ఇంటికి దగ్గరగా ఉన్న పాత గ్యారేజ్‌లో అమెజాన్‌ సంస్థను ప్రారంభించాడు. తొలి ఉద్యోగి భార్య మెకెంజీనే. ఖర్చు కలిసిరావడం కోసం పాత తలుపులను కొని వాటితో చెక్క బల్లలను జెఫ్‌ స్వయంగా తయారుచేసేవాడు. అలా మొద‌లైన అమెజాన్ ప్ర‌స్థానం ఇప్పుడు విజ‌య శిఖ‌రం అంచున నిల‌బ‌డి స‌గ‌ర్వంగా చూస్తోంది. ప్ర‌పంచ కుబేరుల‌ను, దిగ్గ‌జ సంస్థ‌ల‌ను కేవ‌లం ప‌దేళ్ల‌లోనే వెన‌క్కి నెట్టి నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో అంతెత్తున నిల‌బ‌డి యువ‌త‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు జెఫ్. 
 Image result for amazon director family
ఆకాశమే హ‌ద్దుగా..
అవ‌కాశాన్ని అందిపుచ్చుకుని ఆకాశమే హ‌ద్దుగా దూసుకుపోతున్నాడు జెఫ్. ఎంత‌లా అంటే.. అంతరిక్షంలోకి త్వరలోనే కమర్షియల్‌ ఫ్లైట్‌ పంపడానికి అంతా సిద్ధమైపోయిందని తాజాగా ప్రకటించాడు జెఫ్‌. తన బ్లూఆరిజిన్‌ సంస్థ ద్వారా ఈ యాత్ర ఉంటుందనీ, త్వ‌ర‌లోనే టికెట్లు అమ్మబోతున్నామనీ చెప్పాడు. ఎలన్‌మస్క్‌ సంస్థ స్పేస్‌ఎక్స్‌తో పోటీపడుతున్న బ్లూఆరిజిన్‌ ఇప్పటికే పునర్వినియోగానికి పనికివచ్చే రాకెట్‌ని విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది.
Image result for amazon director family
నివాస యోగ్య గ్రహాల సమాచారం తెలుసుకోవడం ఆ సంస్థ లక్ష్యం. భూగ్రహాన్నీ ఇక్కడి వనరుల్నీ మనం విపరీతంగా వాడేశామనీ వట్టిపోయినట్లు తయారైన ఈ భూమి మీద తన మనవల మునిమనవలు బతకడం తనకిష్టం లేదంటాడు జెఫ్‌. గ్రహాంతరయానాన్ని సాధ్యమైనంత త్వరలో సాకారం చేసి ఇతర గ్రహాల మీద మనుషులు నివసించే పరిస్థితులు సృష్టించుకోవాలన్నది తన ఆశయమంటాడు. 

నిజం చెప్పాలంటే అత‌డు అవ‌కాశం సృష్టించుకున్నాడు. అనిత‌ర విజ‌యం సాధించాడు.ఇప్పుడు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోతున్నాడు. ద‌టీజ్ జెఫ్ బెజోస్!


మరింత సమాచారం తెలుసుకోండి: