రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో అంత‌కు మించిన సినిమా క‌థ ఉంటుంది. ఒక్కోసారి ఆ క‌థ ఎంతో మందిని క‌దిలిస్తుంది. ఆలోచింప‌జేస్తుంది. తిరుగులేని స్ఫూర్తినిస్తుంది. తెలుగు సినిమాల్లో యంగ్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న విజ‌య దేవ‌ర‌కొండ స‌క్సెస్ వెన‌క క‌ఠోర శ్ర‌మ ఉంద‌నే విష‌యం మీకు తెలుసా..! 


25 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు అత‌డి ఆంధ్రాబ్యాంక్‌లో 500 రూపాయ‌ల బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయలేకపోయినందుకు అకౌంట్ లాక్ చేశారు. 30 ఏళ్ల‌లోపే సెటిలవ్వమ‌ని తండ్రి స‌ల‌హా ఇచ్చాడు. ఇంకేం ఆ యువ‌కుడు 500 రూపాయ‌లకు ఇబ్బంది ప‌డిన సంద‌ర్భంగా నుంచి కేవ‌లం 4 సంవ‌త్స‌రాల్లోనే కోట్లాది రూపాయ‌లు సంపాదిస్తూ ఏకంగా ఫోర్బ్స్  లిస్టులో చేరాడు. ఇటీవ‌ల జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వీర‌జ‌వాన్ల కుటుంబాల‌కు అంద‌రికంటే ముందే త‌న‌వంతు ఆర్థిక స‌హాయం చేసి సెల‌బ్రెటీల‌కు సైతం స్ఫూర్తిగా నిలిచాడు విజ‌య‌దేవ‌ర‌కొండ‌. 
Image result for vijay devarakonda

సినిమాల్లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ హీరోగా క‌నిపిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. హీరోగా చేసిన సినిమాలు కొన్నే. కానీ యువతలో సంపాదించుకున్న క్రేజ్‌ మాత్రం ఎన్నో హిట్‌ సినిమాలకు సరిపోయేంత. అతడి తొలి సినిమా ‘పెళ్లి చూపులు’ చిన్న సినిమాగా వచ్చి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుకి ఎంపికవగా, అర్జున్‌ రెడ్డి.. సినిమా విజ‌య్‌ని రాత్రికి రాత్రే స్టార్ హీరోను చేసింది. 

 
మధ్యతరగతి కుటుంబానికి చెందిన విజ‌య్ కుటుంబం.. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట్‌ గ్రామం నుంచి హైద‌రాబాద్ వ‌చ్చి స్థిర‌ప‌డింది. సినిమాల మీద ఇష్టంతో విజ‌య్ తండ్రి గోవర్ధన్‌ రావు ప‌లు సీరియ‌ళ్ల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
 
సీన్ క‌ట్ చేస్తే.. విజ‌య్‌కి 25 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు ఆంధ్రాబ్యాంక్ లో 500 బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయలేకపోయినందుకు అకౌంట్ లాక్ చేశారు. అప్పుడు తండ్రి.. విజ‌య్‌ని పిలిచి 30 ఏళ్ల‌ లోపు సెటిల్ అవ్వు. అప్పుడే నువ్వు యువకుడిగా ఉండగా.. నీ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండగా.. నువ్వు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తావు.. అంటూ గొప్ప మాట‌లు చెప్పారు. ఆ మాట‌లే మంత్రంగా ప‌ఠించిన విజ‌య్.. కేవ‌లం నాలుగేళ్లలోనే తిరుగుని విజ‌యం సాధించాడు. గ‌త రెండేళ్ల‌లోనే తిరుగులేని ఆదాయం అందుకుని 2018లో ఫోర్బ్స్ జాబితాలో ఏడాదికి 14 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న సంపన్నుడిగా ఫోర్బ్స్ లిస్టులో 72 వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ.. మ‌రోసారి ఫోర్బ్స్ లిస్టులో చోటు సంపాదించుకున్నాడు. 30 ఏళ్ల‌లోపు సంపన్నుల లిస్టులో చేరి అంద‌రి దృష్టిని త‌న‌వైపే తిప్పుకున్నాడు. 

Image result for vijay devarakonda

 
దేవరకొండతో సినిమా తీస్తున్న బ్యానర్‌లు అన్నీ తర్వాతి సినిమా కాల్షీట్ల కోసం కర్చీఫ్ వేసి రెడీగా ఉన్నాయి. మరోవైపు తెలుగు - తమిళ్ ద్విభాషా చిత్రాలతో కెరీర్ ని పరుగులు పెట్టించాలని తపిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ స్పీడ్ లోనే రెమ్యూన‌రేష‌న్‌లు - అడ్వాన్సులు అంటూ బ్యాంక్ బ్యాలెన్స్ ని స్కైలోకి పరుగులు పెట్టిస్తున్నాడు. మొత్తానికి 30లోపు యూత్ కి విజ‌య్ దేవరకొండ ఓ స్ఫూర్తి అనే చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: