Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 6:57 pm IST

Menu &Sections

Search

స‌క్సెస్ స్టోరీ: ఆ కుర్రాడిని 6000 కోట్ల అధిప‌తిగా మార్చిన సూప‌ర్ ఐడియా!

స‌క్సెస్ స్టోరీ: ఆ కుర్రాడిని 6000 కోట్ల అధిప‌తిగా మార్చిన సూప‌ర్ ఐడియా!
స‌క్సెస్ స్టోరీ: ఆ కుర్రాడిని 6000 కోట్ల అధిప‌తిగా మార్చిన సూప‌ర్ ఐడియా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మన దగ్గర టాలెంట్ ఉంటే, ప్రపంచంలో ఏ శక్తీ మనల్ని ఆపదు. మ‌న‌లో క‌సి ఉంటే ఆకాశమంతా ఎదుగొచ్చు.. అంటూ నిరూపించాడు సిమ్ కార్డులు అమ్మే ఓ కుర్రాడు. ఏకంగా 6000 కోట్లకు అధిపతి అయ్యాడంటే నమ్ముతారా? కచ్చితంగా నమ్మి తీరాయ‌ల్సిందే. ఎందుకుంటే ఇది రీల్ స్టోరీ కాదు. రియల్ స్టోరీ. 
 
మనం రోడ్డు పక్కన వెళ్తుంటే అక్కడ ఓ హోటల్ కనిపిస్తుంది. దాని మీద OYO అని రాసి ఉంటుంది. ఇలా చాలా ఊళ్లలో, చాలా చోట్ల వేలాది హోటళ్ల మీద ఇలా OYO అని రాసి ఉంటుంది ఏదైనా ఊరికి వెళ్లి అక్కడ ఎక్కడ దిగాలో తెలియక ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఓయో రూమ్స్ వెబ్‌సైట్, యాప్‌లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ఈ OYO రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ OYO రూమ్స్ ఫౌండరే మన నిజ‌కథలో హీరో రితేష్ అగర్వాల్. 
 success-story-oyo-founder-ritesh-ritesh-agarwal-oy
17 ఏళ్ల వయసులో రితేష్ అగర్వాల్ ఇంజినీరింగ్ మానేసి OYO రూమ్స్ సంస్థను ప్రారంభించాడు. ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా దాన్ని ఆరేళ్లలోనే 6000 కోట్లకు చేర్చాడు. అతని సక్సెస్ ఎలాంటిదంటే, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పేరుగాంచిన సాఫ్ట్ బ్యాంక్ OYO రూమ్స్‌ సంస్థలో పెట్టుబడులు పెడతామని సిగ్న‌ల్ ఇచ్చింది. బ్యాంక్ సీఈవో మసాయోషీ సన్. రితేష్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఒడిశాలోని కటక్‌లో పుట్టిన రితేష్ అగర్వాల్ రాయగఢ్‌లో  విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఐఐటీలో ఇంజినీరింగ్ చేద్దామనుకుని ఎంట్రన్స్‌ కోసం కోచింగ్ తీసుకున్నాడు. కానీ సఫలం కాలేదు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు.
 
ఢిల్లీలో ఉన్న వర్సిటీ క్యాంపస్‌కి కేవలం రెండే రోజులు వెళ్లినట్టు రితేష్ చెప్పాడు. చదువు మానేస్తాననడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. తర్వాత ఎలాగో ఒప్పుకున్నారు. కానీ, అతనికి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. తొలుత సిమ్ కార్డులు కూడా అమ్మాడు. 
 success-story-oyo-founder-ritesh-ritesh-agarwal-oy
రితేష్‌కి ఈ ఐడియా ఎలా వ‌చ్చిందంటే.. అత‌గాడికి ఊర్లు తిరగడం అంటే సరదా. 2009లో ఓసారి డెహ్రాడూన్, మసూరీ వెళ్లే అవకాశం వచ్చింది. అదే సమయంలో ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించి దాంట్లో అందర్నీ భాగస్వామ్యం చేయాలనుకున్నాడు. అలాగే,పర్యాటకులకు సేవలు అందించేందుకు హోటళ్లు, గెస్ట్‌హౌస్‌ల యజమానులతో కలసి ఓ పోర్టల్ ప్రారంభించాలనుకున్నాడు. 
 
2011లో రితేష్ అగర్వాల్ ఓరావెల్ అనే కంపెనీని ప్రారంభించాడు. అతడి ఐడియా నచ్చి గుర్‌గావ్‌కి చెందిన మనీష్ సింగ్ అందులో పెట్టుబడి పెట్టి కో ఫౌండర్‌గా మారాడు. 2012లో ఓరావెల్‌కి మంచి లాభాలు వచ్చాయి. కంపెనీని వృద్ధిలోకి తీసుకురావడానికి రితేష్ ఎన్నో కష్టాలు పడ్డాడు. ప్రాపర్టీ యజమానులు, కస్టమర్ల చెంతకు సంస్థను తీసుకెళ్లే క్రమంలో పెట్టుబడి, మార్కెటింగ్ లాంటి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఒకసారి సక్సెస్ పట్టాలు ఎక్కడా పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. OYOలో ఇన్వెస్ట్ చేయడానికి సాఫ్ట్ బ్యాంక్ ముందుకొచ్చింది. హీరో ఎంటర్‌ప్రైజ్ 1600 కోట్ల ఫండింగ్ చేయడానికి ముందుకొచ్చింది. ఆ నిధులను భారత్, దక్షిణాసియాల్లో కంపెనీ విస్తరణ కోసం వినియోగించనున్నారు. కొత్త ఇన్వెస్ట్‌మెంట్లతో కలుపుకొని కంపెనీ విలువ ప్రస్తుతం 6000 కోట్ల వరకు చేరింది. అంటే కేవ‌లం పాతికేళ్ల వ‌య‌సు వ‌చ్చేస‌రికే 6000 కోట్ల రూపాయ‌ల‌ను సంపాదించాడు రితేష్‌.

మిడిల్ క్లాస్‌కు చెందిన ఓ సాధార‌ణ కుర్రాడు త‌లుచుకుంటే, ఐడియానే పెట్టుబ‌డిగా దిగితే అద్భుతాలు జ‌రుగుతాయి అన‌డానికి ఈ రితేష్ స్టోరీయే బెస్ట్ ఎగ్జాంఫుల్.


success-story-oyo-founder-ritesh-ritesh-agarwal-oy
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.