Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 7:24 pm IST

Menu &Sections

Search

స‌క్సెస్ స్టోరీ: పేపర్‌ వాలా.. జీవితాన్ని గెలిచాడు..!

స‌క్సెస్ స్టోరీ: పేపర్‌ వాలా.. జీవితాన్ని గెలిచాడు..!
స‌క్సెస్ స్టోరీ: పేపర్‌ వాలా.. జీవితాన్ని గెలిచాడు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఓ వైపు ఆర్థిక స‌మస్యలు, మ‌రోవైపు ఆరోగ్య స‌మ‌స్య‌లు.. త‌ట్టుకోలేని ప‌రిస్థితులు.. జీవితంలో దెబ్బ‌మీద దెబ్బ ప‌డుతోంది. అయితేనేం అత‌ని చేతి పంచ్ మాత్రం వ‌ణ‌క‌లేదు బెణ‌క‌లేదు. గుండెల నిండా ధైర్యం ఉంది. చేతుల్లో బ‌ల‌మైన పంచ్ ఉంది. ఇక ఆడుకున్నాడు ప్ర‌త్య‌ర్థినే కాదు క‌ఠిన ప‌రిస్థితుల‌పై విజ‌యం సాధించాడు. సాహో.. అంటూ బాక్సింగ్ ఛాంపియ‌న్‌గా గెలిచి జీవితంలో రాటుదేలాడు.
deepak-bhoria-boxing-deepak-boxing-champion-succes
అత‌ని పేరు దీపక్‌ భొరియా. బాక్సింగ్‌ ఛాంపియన్‌. గొప్ప టైటిల్ అందుకునే కంటే ముందు ఆయ‌న జీవితం క‌ఠిన ప‌రీక్ష‌గా ఉండేది. ఒకవైపు ఆర్థిక సమస్యలు.. మరోవైపు ఆరోగ్య సమస్యలు.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా వరుసగా సమస్యలు. అయినా దీపక్ మ‌న‌సు చెద‌ర‌లేదు. గుండెల నిండా ధైర్యం నింపుకున్నాడు. అవ‌కాశాలు ఎవ‌రూ ఇవ్వ‌క‌పోతేనేం.. తనకు తానుగా అవకాశాలను సృష్టించుకున్నాడు. తన బంగారు భవిష్యత్తుకు బాటలుగా మలుచుకున్నాడు. తప్పని పరిస్థితుల్లో తల్లిని పనికి పంపించిన అతని చేతులు.. బంగారు పతకాన్ని తల్లి చేతుల్లో పెట్టి అంతే మురిసిపోయాయి. 

జీవితాన్ని గెలిచిన అసలైన ఛాంపియన్‌ దీపక్‌ భొరియా జీవితంలో భ‌యంక‌ర‌మైన ఆటుపోట్లు ఎన్నో ఉన్నాయి. హిస్సార్‌కు చెందిన దీపక్‌ భొరియా నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తండ్రి హోంగార్డు, తల్లి గృహిణి. యూనివర్సల్‌ బాక్సింగ్‌ అకాడమీలో బాక్సింగ్‌ కెరీర్‌ను మొదలుపెట్టాడు. దీపక్‌.. బాక్సింగ్‌లో రాణించాలని కలలు కన్నా.. ఆర్థిక సమస్యలు అతడిని చుట్టుముట్టాయి. 2009లో సమస్యలు తీవ్రం కావడంతో విరామం తీసుకుందామని నిర్ణయించుకున్నాడు. అతని మామయ్య, కోచ్‌ రాజేశ్‌ల ప్రోత్బలంతో ఆలోచనను విరమించుకున్నాడు. కానీ బాక్సింగ్‌లో రాణించాలంటే మంచి శారీరక దారుఢ్యం కావాలి.. మంచి ఆహారం తీసుకోవాలి. సాధన చేసేందుకు మంచి సౌకర్యాలు ఉండాలి. వీటన్నింటిని పక్కనపెడితే తినడానికి కనీసం తిండి కూడా లేని పరిస్థితుల్లోకి దీపక్‌ కుటుంబం చేరుకుంది. దీంతో తల్లిని పనికి పంపించాల్సి వచ్చింది.

deepak-bhoria-boxing-deepak-boxing-champion-succes

మ‌ళ్లీ.. బాక్సింగ్‌ సాధన కొనసాగించాడు. త‌న కుటుంబాన్ని మ‌ళ్లీ వేటాడెందుకు ఆర్థిక ప‌రిస్థితులు చుట్టుముట్టాయి. దీంతో దాదాపు 6 నెలల పాటు బాక్సింగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. దీపక్‌ పరిస్థితి గమనించిన అతని కోచ్‌ రాజేశ్‌.. తన ఖర్చులన్నీ భరిస్తానని ముందుకొచ్చాడు. కోచ్‌ సహకారంతో అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో మరో పిడుగు పడింది. కుడి చేతికి గాయం అయింది. స‌ర్జ‌రీ చేయించుకోవాల్సి వచ్చింది. విరిగిన చేతితో.. మామూలు చేతిలా పంచులు విసరడం కుదరని పని.. ఇక తన బాక్సింగ్‌ భవిష్యత్తు ముగిసినట్లేనా అనుకున్నాడు.. భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది.


అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుని వ‌లే మ‌ళ్లీ సాధన చేశాడు. మళ్లీ మామూలు పంచులు విసిరే స్థాయికి చేరుకున్నాడు.  2012లో రాష్ట్ర స్థాయి బాక్సింగ్స్‌ పోటీల్లో పాల్గొన్న దీపక్‌ స్వర్ణం సాధించాడు. సంతోషం ఎంతోకాలం నిలవలేదు. అదే సమయంలో అమెచ్యూర్‌ బాక్సింగ్‌ మన దేశంలో నిషేధానికి గురైంది. దీంతో టోర్నమెంట్లు జరగలేదు. బాక్సింగ్‌లో గుర్తింపు తెచ్చుకోవాలన్న దీపక్‌కు మరో అడ్డంకి ఏర్పడింది. మళ్లీ కుంగిపోయాడు. మళ్లీ పాత కథే.. ఆర్థిక సమస్యలు.. దీంతో కుటుంబానికి ఎలాగైనా ఆసరాగా నిలవాలని భావించాడు. ప్రతి రోజు వార్త పత్రికలు పంచుతూ.. పేపర్‌ బాయ్‌గా మారాడు. ఒకానొక సమయంలో ఆ పేపర్లు కొనేందుకు కూడా డబ్బు లేకపోవడంతో రెండు నెలల పాటు పేపర్‌బాయ్‌ పనిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. జీవితమంతా శూన్యంలా మారింది.

deepak-bhoria-boxing-deepak-boxing-champion-succes

జీవితంలో ఎదురుదెబ్బ‌లు వ‌రుస‌గా త‌గులుతున్న వేళ 2015లో దీపక్‌కు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అతను ఆర్మీకి ఎంపికయ్యాడు. శిక్షణ తీసుకునేందుకు అక్కడ మంచి ఆహారం, సౌకర్యాలు ఉంటాయి. ఆర్మీలో చేరిన దీపక్‌ పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌కు వెళ్లడం ప్రారంభించాడు. 2016లో సర్వీస్‌ జట్టు తరఫున ఇంటర్‌ సర్వీస్‌ టోర్నీలో పాల్గొన్నాడు. అందులో ఫైనల్‌ వరకూ చేరుకున్నాడు. మరుసటి ఏడాది అదే టోర్నమెంట్‌లో స్వర్ణం సాధించాడు.
2017లో వైజాగ్‌లో సీనియర్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జ‌రుగుతున్నాయి. 49 కిలోల విభాగంలో 3 రౌండ్ల బాక్సింగ్‌ పోటీకి సమయమైంది.  హరియాణాకు చెందిన ఓ అనామకుడు.. బాక్సింగ్‌ రింగులోకి ప్రవేశించాడు. ఇంతలోనే తన దవడపై ఓ కళ్లు బైర్లుకమ్మే బలమైన పంచ్ ప‌డింది. అంతే దీపక్‌ ఒక్కసారిగా నేలకూలాడు. ప్రత్యర్థి కొట్టిన దెబ్బకు దీపక్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్ప‌త్రి పాలైన దీప‌క్.. మూడు నెలల వరకూ చేతులకు గ్లోవ్స్‌ తొడగలేదు. శిక్షణకు వెళ్లలేని స్థితికి చేరుకున్నాడు. బాక్సింగ్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకోవాలన్న దీపక్ క‌ల‌ల‌న్నీ క‌ల్ల‌లైపోతున్నట్లు అనిపించింది. లైఫ్ అంతా శూన్యంలా కనిపించింది. సీన్ క‌ట్ చేస్తే.. ఈ ఏడాది ఇరాన్‌లో నిర్వహించిన మక్రాన్‌ కప్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించాడు. భారత జెండా భుజాలపై వేసుకొని తనలోని ఛాంపియన్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు.

deepak-bhoria-boxing-deepak-boxing-champion-succes

2018లో 48కిలోల సీనియర్‌ బాక్సింగ్‌ విభాగంలో స్వర్ణం సాధించడంతో పాటు అదే సమయంలో ఇంటర్‌ సర్వీసెస్‌ టోర్నమెంట్‌లోనూ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ తర్వాత 49 కిలోల విభాగంలో భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇరాన్‌లో జరుగనున్న మక్రాన్‌ కప్‌ టోర్నమెంట్‌లో ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. అందులో పాల్గొన్న ఆరుగురు బాక్సర్లలో దీపక్‌ మాత్రమే ఫైనల్‌ చేరాడు. ఫైన‌ల్ పోరులో ఇరాన్‌ బాక్సర్‌ జాఫర్‌ నసేరీని మట్టికరిపించాడు. గోల్డ్ మెడ‌ల్ సాధించాడు. ఇప్పుడు త‌న‌ కల ఇప్పుడు నెరవేరిందని, ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, ఇది త‌న‌ భవిష్యత్తుకు బాటలు వేస్తుందని  దీపక్ ఆత్మ‌విశ్వాసంతో చెబుతున్నాడు.


deepak-bhoria-boxing-deepak-boxing-champion-succes
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.