జీవితం అయిపోయింద‌నుకున్న స‌మ‌యంలోనూ ఆమెలో అంతులేని ఆత్మ‌విశ్వాస‌మే క‌నిపించింది. శ‌రీరంలో అన్ని అవ‌య‌వాలు ఉన్నా ప్ర‌పంచాన్ని గెల‌వ‌డం అసాధ్య‌మ‌నుకుంటారు. కానీ ఆమె విధిని ఎదురించి గెలిచింది. రెండు కాళ్లు పోగొట్టుకున్నా ఆమె వెన‌క్కి అడుగువేయ‌లేదు. ఎవ‌రెస్టు అంత ఎత్తుకు ఎదిగి విధిని చూస్తూ బిగ్గ‌ర‌గా న‌వ్వింది.

Image result for arunima sinha

అరుణిమ సిన్హా కేవలం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళనే కాదు. అంతులేని ఆత్మవిశ్వాసంతో విమర్శలకు సమధానంగా నిలిచిన గెలిచిన మహిళ. కాళ్లు లేక‌పోయినా ఎవరెస్టు ఎక్కి ప్ర‌పంచాన్ని భావోద్వేగానికి గురి  చేసింది. అంత‌టితో అక్కడితో ఆగిపోలేదు ఆమె ప‌య‌నం. ఐదు వేర్వేరు ఖండాలలోని అత్యంతఎత్తైన శిఖరాలపై ఆమె కన్నుపడింది. అందులో విన్సన్‌ మాసిఫ్‌, అంటార్కిటికాలోని ఎత్తైన ఎవరెస్టు పర్వతాల్లో ఒకటి. దానిని అధిరోహించాలనేది ఆమె తపన.
2011లో ఆమెకు యాక్సిడెంట్‌ జరిగింది. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లే రైల్లో ప్రయాణం. ఆమె ప్రయాణిస్తున్న జనరల్‌ కంపార్టుమెంట్‌లో కొంతమంది దొంగలు ఆమె గొలుసును దొంగిలించారు. వెంటనే ప్రతిఘటించింది. ఆ దాడిలో వారు ఆమెను రైల్లో నుంచి తోసేశారు.  ఆమె ట్రైన్‌ నుంచి కింద పడకముందే ఆ పక్క ట్రాక్‌మీదుగా అప్పుడే వస్తున్న మరో ట్రైన్‌ను బలంగా ఢీకొంది. దాంతో ట్రాక్‌పై సృహతప్పి పడిపోయింది. సృహలోకి వచ్చిన తర్వాత చూస్తే ఓ కాలు నుజ్జునుజ్జు అయిపోవడం గమనించింది. 'ఆ సమయంలో ఆమె త‌న‌ శక్తినంతా కూడదీసి కేకలు వేసింది. కానీ, సాయం చేయడానికి ఎవరూ రాలేదు. నుజ్జుగా మారిన ఆమె కాలి భాగాన్ని ఎలుకలు కొరకడం ప్రారంభించాయి. ఏం చేయలేని పరిస్థితి. అలా ఆ రాత్రంతా త‌న‌ ముందు వెళుతున్న రైళ్లను లెక్కపెడుతూ గడిపింది. మొత్తం 49 రైళ్లు అలాగే ఆమె కళ్లముందే వెళ్లాయి. ఉదయం అటువైపుగా వెళుతున్న స్థానికులు ఆమెను గమనించి హుటాహుటిన హస్పిటల్‌కి తరలించారు. ఆ నుజ్జునుజ్జయిపోయిన కాలి ప్రాంతంలో మెటల్‌రాడ్‌ కాలిని అమర్చవలసి వచ్చింది. అక్కడినుంచి ఆమెను ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సు న్యూఢిల్లీకి మార్చారు. అక్కడ 4నెల‌ల పాటు ఉంది. 

Image result for arunima sinha

ఆమె 'కొద్దిగా కోలుకున్న తర్వాత నా గురించి మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు ఆమెను కలిచివేశాయి. టిక్కెట్‌ తీసుకోనందుకు ట్రైన్‌లో నుంచి దూకేసింద‌ని కొందరు, ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంద‌ని మరికొందరు రూమర్స్‌ ప్రచారం చేశారు. త‌న‌తోపాటు త‌న కుటుంబసభ్యులు అవన్నీ తప్పుడు వార్తలని చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఎవరూ వారి మాటలు వినలేదు. కార‌ణం మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం. ఎవ‌రి స‌పోర్టు లేని కుటుంబం. తానేంటో నిరూపించుకోవాలని అనుకున్నానని, అందుకు ఏదైనా సాధించాలి. ఇలా సతమతమవుతున్న సమయంలోనే ఎవరెస్టును అధిరోహించాలనే కోరిక ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. నిజానికి, ఎవరికైనా హెర్‌లైన్‌ ఫ్యాక్చర్‌ అయితే కదలాడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ, అరుణిమ స్టోరీ విన్నవారు ధైర్యంతో ముందడుగు వేస్తారు. ఆమె కజిన్‌ ఓమ్‌ ప్రకాష్‌ ప్రమాదం తర్వాత ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడు. అతను సెంట్రల్‌ రిజర్వ్‌ ఫోలీస్‌ ఫోర్స్‌లో చేసేవారు. అరుణిమకు యాక్సిడెంట్‌ అయినప్పటి నుంచి తను జాబ్‌ను వదిలేసి, తనకు సేవలు చేస్తూ వచ్చాడు. ప్రొస్తెటిక్‌ కాలుతో నడవడానికి ఏన్నో సంవత్సరాల సమయం పడుతుంది. కానీ, అరుణిమ రెండేళ్ల‌లోనే నడవడం మొదలుపెట్టింది. 

Related image

న‌డిచిన‌ప్పుడు ఆమె కాలు నుంచి రక్తం వచ్చేది. ఈ ప్రొస్తెటిక్‌ కాలుతో ఎవరెస్టు మీద పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నువ్వు ఈ పని చేయలేవు అని అన్నవారికి, చేసి చూపించాను. నా ఫిజికల్‌ స్ట్రెంగ్త్‌ని చూసి నన్ను జడ్జ్‌ చేస్తుంటారు. లోపల ఏం జరుగుతుందో నేనేలా బాధపడుతున్నానో మాత్రం వారికి తెలియదు. అయినా, అలాంటి మాటలు మనలో సాధించాలనే కసిని పురుగొల్పుతాయి అంటుందామే. అదే ప్రొస్తెటిక్‌ కాలితో అరుణిమ అత్యంతఎతైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించక ముందే కొన్ని శిఖరాలను అధిరోహించింది.

Related image

ఎవరెస్టు టాప్‌లో ఉన్నప్పుడు, ప్రపంచాన్ని చూసి బిగ్గరగా నవ్వుతానని స‌గ‌ర్వంగా చెబుతుంది అరుణిమ‌. తానే టాప్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ అని, ఎవరూ చేయలేనిది తాను చేశానని, త‌న‌ను ఎవరయితే హేళన చేశారో వారి ముందు నిలబడి నవ్వాలనుందని, ఎవరైతే నన్ను బలహీనురాలుని అనుకున్నారో, ఎవరైయితే ఈ పని మేం చేయలేం అని అనుకుంటారో వారికి చెప్పేది ఒక్కటే సంకల్పం గట్టిదైతే నీ పనికేది అడ్డు ఉండదు అని గర్వంగా చెబుతోంది. అంతేకాదు అరుణిమా తన లాంటి వారికోసం ఒక ఇంటర్నేషనల్‌ స్పోర్ట్‌ అకాడమీ పెట్టాలని అనుకుంటోంది. ఇంతేకాదు, ప్రస్తుతం 120 మంది వికలాంగ పిల్లల్ని దత్తత తీసుకుని, సాయం చేస్తోంది. 
ఆత్మవిశ్వాసంతో శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా ఉన్నవారు కూడా సాధించని రికార్డులు.. చేయని అద్భుతాలు అరుణిమా చేస్తుండటం అందరికీ ఆశ్చర్యం, స్ఫూర్తి కలిగించే విషయమే! నేటి యువ‌త‌కి అరుణిమా విజయగాథ ఓ పాఠంలా పనికొస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: