నాన్నే నారాయణుడు. సమయాన్ని సందర్భాన్ని బట్టి తానే దశావదారుడు అవుతాడు.

 

* పాకడానికి ప్రయత్నించేటప్పుడు "మత్స్యం" అవుతాడు..

 

* ఆటలాడే సమయానికి "కూర్మం" అవుతాడు..

 

* కాస్తా పెరగగానే తల మీద ఎత్తుకొని వేసే చిందుల్లో "వారాహుడు " అవుతాడు.

 

* అల్లరి ఎంత చేసిన పైకి మాత్రమే కోపం నటించే "నరసింహుడు " అవుతాడు.

 

* తాహతు తేలీక అడిగే కోర్కెల కోసం తాను తగ్గి వేరే వాళ్ల ముందు చేయ్యి చాచే వెర్రి "వామనుడు " అవుతాడు.

 

* వెయ్యి కష్టాలు వచ్చిన అలవోకగా నరుకుంటు వెళ్ళే"భార్గవుడు " అవుతాడు.

 

* జీవిత విలువల నడక నేర్పే "రాముడు " అవుతాడు.

 

* జీవన యుద్దపు నడత నేర్పే "కృష్ణుడు "

 

* చివరికి ఏదేమైనా.. నాన్నే నారాయణుడు!!

 

పితృ దేవో భవ.

మరింత సమాచారం తెలుసుకోండి: