మీకు సెల్ఫీలు ఎక్కువగా తీసుకునే అలవాటు ఉందా? నిత్యం ఫోన్‌తో ఉంటూ సెల్ఫీల ప్రపంచంలో విహరిస్తూ ఉంటారా ? అయితే, జాగ్రత్త ! మీకు తెలియకుండానే ఈ కొత్తరకం వ్యాధిబారిన పడొచ్చు. త‌ర‌చూ సెల్ఫీలు తీసుకునే వారికి ఇది చేదు వార్తే! సెల్ఫీలు తీసుకునే స‌మయంలో ఫోన్ల నుంచి వెలువ‌డే నీలిరంగు కాంతి, ధార్మిక శ‌క్తి ముఖ‌చ‌ర్మానికి హాని క‌లిగిస్తాయి అంటున్నారు. 


లండ‌న్ ప‌రిశోధ‌కులు, సెల్‌ఫోన్ నుంచి వెలువ‌డే కాంతి, ధార్మికశ‌క్తి  ముఖం మీద ముడ‌త‌ల‌ను క‌లిగి అకాల వృద్ధాప్యానికి కార‌ణం అవుతాయ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. ఓ ప‌క్క‌గా ముఖం పెట్టి సెల్ఫీ తీసుకునేవారికి ఈ ప్ర‌మాదం ఎక్కువ అని వారు చెబుతున్నారు. డీఎన్ఎ క‌ణాల మీద కూడా వీటి ప్ర‌భావం  ఉంటుందంటున్నారు. సెల్ఫీలు తీసుకునే స‌మ‌యంలో స‌న్‌స్క్రీన్ లోష‌న్ ఉప‌యోగించినా ఫ‌లితం ఉండ‌ద‌ని వారు స్ప‌ష్టం చేస్తున్నారు. 


చ‌ర్మ సౌంద‌ర్యాన్నీ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సెల్ఫీల‌కు సాధ్య‌మైనంద వ‌ర‌కూ దూరంగా ఉండ‌డ‌మే మంచిద‌ని వారు అంటున్నారు.అలాగే సెల్ఫీల వ‌ల్ల ఎన్నో ప్ర‌మాధాలు కూడా జ‌రుగుతున్నాయి. ఈ ఏడాది నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. 2011 నుంచి 2017 నవంబరు వరకు 259 సెల్ఫీ మరణాలు సంభవించాయి. వీటిలో అత్యధిక మరణాలు ఇండియా, అమెరికా, రష్యా, పాకిస్తాన్‌లలో చోటుచేసుకున్నాయి. ఏదేమైనా సెల్ఫీల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిద‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: