హెమరాయిడ్స్ లేదా పైల్స్ అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధరణమైన అనారోగ్యపు సమస్యగా మారింది. అందుకు కారణం ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు వల్ల అనేక రకాలైన అనారోగ్యాల భారీన పడుతున్నారు. విధుల నిర్వ‌హ‌ణ‌లో రోజుకు ఎనిమిది గంట‌ల‌కు పైగా కుర్చీలోనే ఉండేవారికి పైల్ప్ వ్యాధి ముప్పు త‌ప్ప‌ద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అలా గంట‌ల పాటు కూర్చుని ప‌నిచేసే వారు ఆహారంలో పీచు అధికంగా  ఉండేలా చూసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. తాజా కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను రోజూ డైట్‌లో చేర్చుకోవాలి.


- పైల్స్ నివార‌ణ‌కు పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంతేగాకుండా సోయా బీన్స్‌, బ్లాక్ బీన్స్‌, పీచు అధికంగా ఉండే కూర‌గాయ‌లు, ధాన్యాలు వంటివి పైల్స్ రోగాన్ని నిరోధిస్తాయి. 


- మామిడి, నిమ్మ‌, బొప్పాయి, మొద‌లైన పండ్ల ర‌సాలు రోజు తాగాలి.


- పచ్చి ఉల్లిపాయ పైల్స్ సమస్యను నివారించడానికి బాగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల రక్తం పడటాన్ని తగ్గించి అనల్ పెయిన్ తగ్గిస్తుంది.


- పసుపులో అనేక వైద్య లక్షణాలు కలిగి ఉన్నాయి. మీరు సహజంగా పైల్స్ ను నివారించాలనుకుంటే పసుపు కొమ్మ లేదా పసుపును నీటిలో వేసి ఆ నీటిని బాగా తాగాలి.


-  పైల్స్ కు ఒక గ్లాసు ముల్లంగి రసం చాలా అద్భుతంగా చేస్తుంది. ముందుగా 1/4కప్పుతో ప్రారంభించి, రోజు రోజుకూ అరకప్పు రసంను పెంచుకుంటూ పోవాలి.


- అల్లం -నిమ్మరసం జ్యూస్ పైల్స్ కు డీహైడ్రేషన్ కూడా ఒక ప్రధానకారణం. అందువల్ల అల్లం, నిమ్మరసం, తేనె కలిపిన జ్యూస్ ను ప్రతి రోజూ రెండు సార్లు తాగాలి. ఇది చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.


అలాగే ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటితో మొలలు వస్తుంటాయి. నీరు తక్కువగా తాగడం, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి కూడా ఇందుకు కారణం అవుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పైల్స్ ను పోగొట్టుకోవొచ్చు. పైల్స్ నివారణకు పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తాజా దొరికే గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్ తరచూ ఆహారంలో తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: