స‌హ‌జంగా దొండ‌కాయ‌లు ఏ సీజ‌న్‌లో అయినా విరివిగా దొరికే కూర‌గాయ‌ల్లో ఒక‌టి. చిన్న‌గా ఉంది క‌దా అని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. దీని గురించి త‌క్కువ అంచ‌నా వేస్తే పొర‌పాటే. దొండ‌కాయ‌ల‌తో ఎన్నో ర‌కాలుగా వంట‌లు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిక‌రంగా ఉండే ఈ దొండ‌కాయ‌లో అనేక ర‌కాల పోష‌కాలు  ఉన్నాయి. అయితే చాలా మంది దొండ‌కాయ తింటే మ‌తిమ‌రుపు వ‌స్తుంద‌ని అంటుంటారు. కాని నిజం కాదు. దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ శాతంలో ఉంటాయి. పీచూ, ప్రోటీన్లు కూడా లభ్యమవుతాయి. శ‌రీరానికి కావాల్సిన ఎన్నో పోష‌కాలు దొండ‌కాయ వ‌ల్ల అందుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..


- మ‌న శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే ఎక్కువ‌గా అల‌స‌ట మ‌రియు ర‌క్త‌హీన‌త‌కు కార‌ణం అవుతుంది. మ‌రియు అనేక ర‌కాల రోగాలకు పునాది ప‌డిన‌ట్టే. ఇలాంటి వారికి దొండ‌కాయ తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన ఐర‌న్ ల‌భిస్తుంది.


- దొండ‌కాయ‌లో ఉండే కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా స‌హాయ‌ప‌డుతుంది. ఎముకలను బ‌లంగా ఉండేందుకు తోడ్పడుతుంది.


- దొండ‌కాయ‌లో ఉండే సి విటమిన్, బీటా కెరోటిన్లు శరీరంలో క్యాన్సర్ కణాల పెర‌గ‌కుండా యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ వాటిని అడ్డుకుంటాయి.


- దొండ‌కాయ‌లో ఉండే పొటాషియం వల్ల గుండె జ‌బ్బులు రాకుండా చేస్తాయి. మ‌రియు రక్త ప్రసరణ కూడా బాగా జరిగేందుకు సహాయం చేస్తాయి.


- దొండకాయల్ని ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకోవడం వల్ల శరీరంలో పనితీరు బాగుంటుంది. మ‌రియు మ‌ధుమేహాన్ని కంట్రోల్ చేయ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.


- వీటిలో ఉండే యాంటీ- హిస్టమైన్ గుణాల వల్ల అలర్జీ రాకుండా చూస్తాయి. .వీటిని తరుచుగా తీసుకోవడం వల్ల జ్వరం, ఆస్తమ, జాండీస్…. ఇలా రకరకాల రోగాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.


- బ‌రువును త‌గ్గించుకోవాల‌న్నా మ‌రియు అదుపులో పెట్టుకోవాల‌న్నా దొండ‌కాయ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దొండ‌కాయ శ‌రీర బ‌రువును బాగా కంట్రోల్ చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: