పుట్టగొడుగుల్లో పోషక పదార్థాలు, ఔషధగుణాలు ఉన్నాయి, కాబట్టి వాటిని ప్రత్యేక వాతావరణంలో సాగుచేస్తున్నారు. అందులోనూ ఇది అందరూ తిన‌గ‌ల ఆహారం. అంతేకాక ఇది మాంసాహారంతో సమాన పోషకాలు ఇస్తుంది. 


అలాగే వానాకాలములో పుట్టలమీద మొలిచే ఈ గొడుగులు రుచిలో సాటిలేనివి. ముఖ్యంగా వర్షాకాలం పుట్టగొడుగులు సీజన్. పుట్టగొడుగుల్లో`ఇర్గోథియోనైన్‌, సెలీనియం` అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శ‌రీరంలో య‌ధేచ్ఛ‌గా సంచ‌రిస్తూ డిఎన్ఎను దెబ్బతీస్తూ, గుండె జబ్బులకు, క్యాన్సర్లకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను ఎదుర్కొంటాయి. పుట్టగొడుగుల్లో 90% నీరే ఉంటుంది. 


- పుట్ట‌గొడుగుల్లో సోడియం ఉండదు కాని పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. కొవ్వు పదార్థము తక్కువ.. ఫలితంగా బరువు పెరుగుతాం అన్న భయం ఉండదు.


- పుట్టగొడుగుల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. గనుక ఎముకలు, దంతాల పుష్టికి సహకరిస్తుంది.


- మట్టి నుంచి గ్రహించిన పోషకాలు కలిగి ఉంటాయి. కనుక మొక్క‌ల్లోని లక్షణాలు కలిగి ఉంటాయి. పుట్టగొడుగులు మాంసకృత్తులు లభిస్తాయి. శరీర సౌష్టవం, కండర పుష్టికి దోహదపడతాయి.


- పుట్టగొడుగులలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి, మెదడుకి, కండ‌రాల‌కు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. తద్వారా వాటి పని సమాన సామర్థ్యం పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.


- రక్తపోటుకు బరువు తగ్గాలని అనుకొనే వారికి పుట్టగొడుగులు ఎంతో మంచిది. పుట్టగొడుగుల్లా 80-90 శాతం వరకు నీరే ఉంటుంది. 


- రోజుకు 200 గ్రాముల చొప్పున వారానికి ఐదుసార్లు వీటిని తింటే రక్తపోటు నియంత్రణకు తోడ్పడతాయి. 


- పుట్ట‌గొడుగుల్లో పొటాషియం పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది. 


- రైటోఫ్లావిన్‌, నియాసిన్‌లు శరీరంలో విజృంఖ‌ల క‌ణాల మూలంగా కలిగే హానిని నియంత్రిస్తాయి. ఈ విట‌మిన్ ఇ, సెలీనియం ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: