Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 9:43 pm IST

Menu &Sections

Search

నోరూరించే సరికొత్త స్టాటార్ "హనీ బటర్ ఫ్రైడ్ చికెన్"..

నోరూరించే సరికొత్త స్టాటార్ "హనీ బటర్ ఫ్రైడ్ చికెన్"..
నోరూరించే సరికొత్త స్టాటార్ "హనీ బటర్ ఫ్రైడ్ చికెన్"..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నాన్ వెజ్ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది చికెన్. చికెన్ మనం చాలా విధాలుగా చేసుకుంటాము. రైస్ ఐటమ్స్,కర్రీ, ఫ్రై ఇంకా ఎనో రకాలు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కొరియన్ స్టైల్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం.   కొరియన్ స్టైల్ "హనీ బటర్ ఫ్రైడ్ చికెన్" కి కావాల్సిన పధార్ధాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం.

"హనీ బటర్ ఫ్రైడ్ చికెన్" కావాల్సిన పధార్ధాలు:
చికెన్-1/2kg 
కార్న్-ఫ్లోర్ -కొద్దిగ
మైదా-కొద్దిగ
గుడ్లు-2
బేకింగ్ పౌడర్-1
టేబుల్ స్పూన్ తేనె
సోయా సాస్- కొద్దిగ 
పంచదార  టేబుల్ స్పూన్ 
వెల్లులీ-2 రెబ్బలు
ఆయిల్-డీప్  ఫ్రై కి సరిపడా
ఉప్పు-తగినంత
మిరియాల పొడి-కొద్దిగ
బటర్ (వెన్న)-కొద్దిగ
కొత్తిమీర-కొద్దిగ
"హనీ బటర్ ఫ్రైడ్ చికెన్"


తయారీ విధానం:
  ముందుగా మనం చికెన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇలా కట్ చేసిన ముక్కలను సుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దాంట్లో కార్న్ ఫ్లోర్,మైదా,గుడ్లు,ఉప్పు,మిరియాల పొడి, బేకింగ్ పౌడర్ వేసుకోని బాగా కలుపుకోవాలి.ఇలా కలిపిన మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పేట్టుకుని దాంట్లో డీ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఆయిల్ లో వేసుకోని డీ ఫ్రై చేసుకోవాలి.అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై అయిన తరువాత చికెన్ ముక్కలను తీసి మళ్ళి వాటిని ఇంకో సారి ఫ్రై చేయాలి.ఇలా ఫ్రై అయిన ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.

"సాస్" తయారు చేయు విధానాన్ని మనం ఇప్పుడు చూదాం:

మళ్లీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడిగా అయ్యాక మనం బటర్ వేసుకోవాలి. వెల్లులి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోని బటర్ వేసుకున్న ప్యాన్ లో వేసి కొంచం సేపు వేగనివ్వాలి,వేగిన తరువాత సోయా సాస్ కొద్దిగ,పంచదార వేసి బాగా కలపాలి. తరువాత కొద్దిగ తేనె వేసుకుని మళ్లీ కలుపుకుని తిక్ సాస్ లాగా వచ్చాక దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఈ సాస్ లో వేసి ముక్కలకి పట్టేల బాగా కలుపుకోవాలి. నోరూరించే రుచికరమైన "హనీ బటర్ ఫ్రైడ్ చికెన్" సిద్ధమైంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ గిన్నెలోకి తీసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవటమే.


lifestyle
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.