కొంతమంది అమ్మాయిలకు సైజ్ జీరో సినిమా వచ్చాక కూడా అర్థం కావడం లేదు. దారంల ఉన్న కూడా షేప్స్ అని ఆదని ఇదని లావు తగ్గాలి అని తెగ కష్టపడుతుంటారు. కొంతమంది అమ్మాయిలు అయితే మరీ దారుణంగా తిండి కూడా తినకుండా కడుపు మాడ్చుకొని మరి సన్నగా అవ్వడానికి ప్రయత్నించి అనారోగ్యం బారిన పడుతున్నారు. 


మరికొంతమంది అయితే ఆరోగ్యం కోసం.. ఫ్రెష్ గా ఉండటం కోసం చేదుగా ఉన్న సరే గ్రీన్ టీ తాగి నరకాన్ని అనుభవిస్తుంటారు. కొంతమంది రియల్ లైఫ్ నటులు అయితే ప్రకటనలు చూసి వాళ్ళు ఆస్వాదిస్తూ తగినట్టే లోపల నరకాన్ని అనుభవించిన వీళ్ళు ఆస్వాదిస్తూ తగినట్టు నటిస్తారు.. 


ఇంకా విషయానికి వస్తే ఒక అమ్మాయిలు అనే కాదు ప్రతిఒక్కరు వారి ఆరోగ్యం కోసం కాఫీ, టీ బదులుగా 'గ్రీన్ టీ' తగుతుంటారు. ఆ టీ లో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ అనేకమైన నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలను చూస్తే ఇప్పుడే ఆ గ్రీన్ టీ మనేస్తారు. అలాంటి నష్టాలు ఆ గ్రీన్ టీ లో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చుడండి. 


చాలామంది గ్రీన్ టీ తాగేదే వెయిట్ లాస్ కోసం.. కానీ వారు గ్రీన్ టీ లో షుగర్ వేసుకొని మరి తాగుతారు. ఇంకా గ్రీన్ టీ ఏంటి ఏ టీ వారిని వెయిట్ లాస్  చెయ్యలేదు. ఆ టీ లో షుగర్ బదులు హనీ వేసుకుంటే ఫలితం కనిపించచ్చు. 


 గ్రీన్ టీ ని రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మనస్సు మీద దుష్ప్రభావం చూపుతుంది. కారణం గ్రీన్ టీలో ఉండే అధిక యాంటీయాక్సిడెంట్స్ హార్మోనులను విడగొట్టడం వల్ల గ్రంథుల్లో మార్పులు వస్తాయి.


గ్రీన్ టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కెఫిన్ తక్కువగానే తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. కెఫీన్ ఎక్కువ అయితే శరీరంలో బాడీ ఫంక్షన్స్ పని చేయడం ఆపేస్తుంది. 


గ్రీన్ టీలో టానిన్ అనే కంటెంట్ ఉదరంలో ఎక్కువ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. ఎక్కువ హాని కలిగించకపోయినా, ఉదర సమస్యలకు దారితీస్తుంది. 


ఇలా గ్రీన్ టీ వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నట్టు సమాచారం. మరి ఈసారి గ్రీన్ టీ తాగేప్పుడు కొంచం జాగ్రత్త పడండి. లేకుంటే ఈ సమస్యలు వస్తాయి మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: