భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం,స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం.సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మిన వ్యక్తి అల్లూరి.అంతేకాకుండా స్వతంత్రం కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు కూడా.కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరుపేదలు,నిరక్షరాస్యులు, అమాయకులయిన అనుచరులతో,చాలా తక్కువ యుద్ద పరికరాలతో బ్రిటీషు సామ్రాజ్యాన్ని ఢీ కొట్టి గడగడ వణికించి,వారిని పరుగులు పెట్టించిన ధీరుడు. వీర మరణం పొందిన ఈ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు..ఇప్పుడు ఈ వీరుడి గురించి కాస్త తెలుసుకుందాం.



అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం వద్ద ఉన్న పాండ్రంగి (పద్మనాభం) గ్రామంలో 1897 జూలై 4 న వెంకట రామరాజు,సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించాడు.ఇతను తెలుగు క్షత్రియ కుటుంబానికి చెందినవాడు.రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది.ఆ కాలంలోనే చుట్టుపక్కల వున్న  కొండలు, అడవులలో తిరుగుతూ,గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు.ధారకొండ,కృష్ణదేవీపేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు.వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం,వాస్తు శాస్త్రం,హఠయోగం,కవిత్వం నేర్చుకున్నాడు.సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం,ఆయుర్వేదం నేర్చుకున్నాడు.చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి,నాయకత్వ లక్షణాలు,దాన గుణం అధికంగా ఉండటం వల్ల.నిత్యం దైవ పూజ చేసేవాడు.



తుని సమీపంలో ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు కూడా చేశాడు.దేవాలయాల్లోను,కొండలపైన,శ్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు.దేవీపూజలు చేసేవాడు.అంతే కాకుండా అన్ని కాలాల్లోనూ శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను విడువకుండా శ్రద్ధగా పాటించేవాడు.ఇలా అనేక యుద్ధవిద్యల్లోను,ఆయుర్వేద వైద్యవిద్యలోను ప్రావీణ్యుడవటంచేత త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు.ఇక ఈ యన మరణం మే 7, 1924 న విశాఖపట్నం . కొయ్యూరులో మంప గ్రామంలో ఆయన వీరమరణం పొందాడు..ఇక అల్లూరి సీతారామరాజుని ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు.ఈయన తండ్రి,అల్లూరి వెంకట రామరాజు,తల్లి,సూర్యనారాయణమ్మ.తమ్ముడు,సత్య నారాయణ రాజు.చెల్లి,సీతమ్మ దంతులుతి.

మరింత సమాచారం తెలుసుకోండి: