సాధారణంగా బాగా అలసిపోయి విశ్రాంతి కావాలని టీవీ ముందు వెళ్లి కూర్చుంటారు. టీవీ చూస్తుంటే నోరు ఊరికే ఉండదు. ఏదోకటి తిను తిను అని లాగేస్తుంది. ఆ సమయంలో స్నాక్స్ కానీ భోజనం కానీ ఏమైనా సరే తినడం మొదలు పెడితే టీవీలో ప్రసారమయ్యే షో ముగిసే వరుకు ఆపారు. టీవీ చూస్తున్న సమయంలో ఎంత తిన్నాం. ఏం తిన్నాం అనేది ఏ మాత్రం గుర్తుండదు. 


అందుకే ఎలా అంటే ఆలా తినేస్తాం. కానీ ఆలా టీవీ చూస్తూ తినడం వల్ల చాల అనర్ధాలు జరుగుతాయి. అవి ఏంటో ఇక్కడ చుడండి. టీవీ చూస్తూ స్నాక్స్‌ తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. బ్రెజిల్‌కు చెందిన పలువురు శాస్త్రవేత్తలు 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సున్న 33,900 మంది టీనేజర్ల ఆహారపు అలవాట్లు, వారికి ఉన్న వ్యాధులు, వారి జీవనశైలి.. తదితర సమాచారాన్నంతా సేకరించి విశ్లేషించారు. 


దీంతో పరిశోధనలో తేలిందేమిటంటే… నిత్యం 6 గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారిలో కొందరికి మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉన్నట్లు గుర్తించారు. మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉంటే డయాబెటిస్‌, గుండె జబ్బులు త్వరగా వస్తాయని సైంటిస్టులు తేల్చి చెప్పారు. కనుక టీవీ ఎక్కువగా చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారు ఆ అలవాటును మానుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. లేదంటే చూశారుగా వ్యాధుల బరిటా పడక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: