అరటి పండు.. ఈ పండు ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ఒక్క అరటి పండు తిన్న కడుపు ఫుల్ అయినట్టు ఉంటుంది. అరటి పండుకి అంత విలువ ఉంది. అయితే అరటి పండుని పరగడుపునే తింటే చాలా ప్రమాదమట. ఈ విషయాన్నీ పోషకాహార నిపుణులే చెబుతున్నారు. అరటి పండు సంపూర్ణ ఆరోగ్య ప్రదాయినిగా అందరికీతెలిసిన విషయమే.


అరటి పండు తినటం వల్ల శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. అరటి పండులో పొటాషియం ఉండడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు కూడా భారీగా తగ్గుతాయి. ఇన్నీఆరోగ్య ప్రయోజనాలు దాగివున్న అరటి పండ్లను పరగడుపున తింటే ప్రమాదం ఎందుకు అంటే.. ఉదయాన్నే ఈ పండ్లు తినటం వల్ల మల్లి నిద్రవోస్తుంది. ఆలా నిద్రవస్తే ఉదయాన్నే నిద్ర మొబ్బుల ఉంటాము. 


అరటిపండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉండటంతో అవి వెంటనే శక్తిని ఇస్తాయి. ఆలా కొన్ని గంటల వ్యవధిలోనే పొందిన శక్తి తగ్గిపోతుంది. అలానే మనలో ఉన్న చురుకుదనాన్ని నెమ్మదించేలా చేస్తుంది. కాగా అరటి పళ్లలో సహజమైన యాసిడిక్ గుణాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే అరటి పండును పరగడుపునే తినకండి. సమస్యలు తెచ్చుకోకండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: