ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. అయితే ప్ర‌స్తుత కాలంలో ఉరుకులు ప‌రుగుల జీవితం. తినడానికే తీరిక ఉండని వేళలు.. టైం లేదని చెప్పి ఏదో గబాగబా తినేవాళ్లు చాలమంది ఉన్నారు. కొందరైతే పనిలో పడి తిండి విషయమే మరిచిపోతుంటారు. అయితే తిన‌డానికి కూడా కొన్ని నియ‌మాలు ఉంటాయి. 


సాధార‌ణంగా చాలా మంది మార్నింగ్ చేసే టిఫెన్ మధ్యహ్నం చేస్తుంటారు. ఇక నైట్ ఏ టైంకి తింటారో కూడా తెలియని వాళ్లు ఉన్నారు. అయితే ఆహారం స‌రైన టైమ్‌లో తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. అదే విధంగా ఆహారం గబాగబా తినటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయట.  కొంత మంది బరువు తగ్గడానికి భోజనంలో కార్బోహైడ్రేట్లు పూర్తిగా మానేద్దా మనుకుంటారు. కానీ, డైటింగ్‌ చేసే కాలంలో కూడా శరీరానికి కార్బోహైడ్రేట్లు తప్పనిసరి అవసరమవుతాయి.


అలాగే తినే ఆహారం మీద మనసు లగ్నం చేయడం వల్ల శరీరానికి పోషకాలు సరిగ్గా అందుతాయంటున్నారు నిపుణులు. ఆహారాన్ని ఇష్టంగా తినడం వల్ల ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారని.. మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. అదే విధంగా భోజనాన్ని చిన్న చిన్న మీల్స్‌ రూపంలో తీసుకోవాలి. అంటే రెండు, మూడు గంటలకోసారి తీసుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: