నిఖిల్ పెర్ఫార్మన్స్ , అక్కడక్కడా వర్కౌట్ అయిన పృథ్వి రాజ్, సప్తగిరిల కామెడీ , ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ , సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ , చిన్న ఆర్ట్ వర్క్నిఖిల్ పెర్ఫార్మన్స్ , అక్కడక్కడా వర్కౌట్ అయిన పృథ్వి రాజ్, సప్తగిరిల కామెడీ , ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ , సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ , చిన్న ఆర్ట్ వర్క్రొటీన్ కథ , పసలేని కథనం , వర్కౌట్ కాని ఫ్యామిలీ ఎమోషన్స్ , వీక్ డైరెక్షన్ , ఎడిటింగ్ , రన్ టైం , పనికిరాకుండా పోయిన బోలెడు పాత్రలు

యుఎస్ లో మిలియన్ డాలర్స్ కి అధిపతి అయిన సుమన్ వారసుడు గౌతమ్(నిఖిల్). అందుకే లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ సుమన్ ని ఫ్రెండ్స్ ముంచేయడంతో ఆస్తి అంతా పోయి బ్యాంకుకి 12 కోట్లు కట్టాల్సి వస్తుంది. దాంతో గౌతమ్ మదర్ అయిన సితార, తన పేరు మీద బిహార్ లో శంకరాభరణం అనే పాలెస్ ఉందని దాన్ని అమ్మి డబ్బు తెచ్చుకుంటే సమస్య తీరిపోతుందని చెప్తుంది. దాంతో మన గౌతమ్ బీహార్ వస్తాడు. అక్కడేమో అదే పాలెస్ లో సితారకి చెందిన ఫ్యామిలీ గత 15 ఏళ్ళుగా ఉంటుంటారు. వాళ్ళని ఎలాగోలాగా బురిడీ కొట్టించి పాలెస్ అమ్మేయాలని అన్నీ సెట్ చేసుకుంటాడు. కానీ ఈ లోగా అమెరికాలో గౌతమ్ రిచ్ కిడ్ అని తెలుసుకున్న బిహార్ లోని ఓ కిడ్నాప్ ముఠా గౌతమ్ ని కిడ్నాప్ చేసి డబ్బు ఇమ్మంటాడు. కానీ డబ్బులు లేని గౌతమ్ అదే గ్యాంగ్ తో కలిసి మిగతా కిడ్నాప్ ముఠాల నుంచి డబ్బు వసూలు చేయాలని ఓ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఏంటి? ఈ ప్లాన్ వలన గౌతమ్ ఎదుర్కున్న ఇబ్బందులేమిటి? ఫైనల్ గా ఈ కిడ్నాప్ గ్యాంగ్స్  నుంచి ఎలా తప్పించుకొని తన ఫ్యామిలీ సమస్యని తీర్చాడు? అలాగే శంకరాభరణం పాలెస్ ని అమ్మాడా లేదా అన్నదే మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

వరుసగా డీసెంట్ హిట్స్ ఇచ్చిన నిఖిల్ చేసిన ఈ శంకరాభరణంలో నటీనటులు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉంటారు. అందులో సినిమాకి కూసింతన్నా హెల్ప్ అయిన వారి గురించి చెబుతా.. ముందుగా హీరో నిఖిల్  ఎన్నారై పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోయేలా తన లుక్ అండ్ మానరిజమ్స్ ని బాగా చూపించాడు. ఇక నటన పరంగా చూసుకుంటే తనవరకూ కథలో రాసిన పాత్రకి తనే పర్ఫెక్ట్ అనేలా చేసాడు. అలాగే నిఖిల్ పాత్రలో కథా పరంగా క్లాస్ నుంచి మాస్ గా మారిపోవాలి. ఆ ఫీల్ ని ఆడియన్స్ కి ఇవ్వడంలో కూడా సక్సెస్ అయ్యాడు. ఇకపోతే హీరోయిన్ నందిత నేనె కేక, మన రేంజే వేరు అనుకునే పాత్రలో బాగానే చేసింది. ఫస్ట్ టైం నందిత ఫన్ టచ్ ఉన్న పాత్ర చేసింది, ఓవరాల్ గా సూపర్ అనలేం కానీ ఓకే   అనేలా చేసింది. ఇకపోతే అంజలి బందిపోటు రాణిగా ఓ ముఖ్య పాత్రలో మెరిసింది. బలుపు, పొగరు ఉన్న సీరియస్ అమ్మాయిగా బాగానే చేసింది కానీ అంజలి ఎపిసోడ్ సినిమాకి హెల్ప్ అవ్వలేదు. కొన్ని చోట్ల అవసరానికి మించి అంజలి చేత హావ భావాలు పలికించారు.


ఇక కమెడియన్స్ అయిన 30 ఇయర్స్ పృథ్వి, సప్తగిరి, సంజయ్ మిశ్రా, వైవా హర్షలు తమ మార్క్ డైలాగ్ డెలివరీతో పంచ్ డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను కాస్త నవ్వించారు. సంపత్ రాజ్ నెగటివ్ షేడ్స్ పాత్రలో మరోసారి మెప్పించాడు. ఇక రావు రమేష్, సుమన్, సితార లాంటి వారు వారివారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. కొత్తవారిన గజి, పూజ కుమార్ లు ఓకే అనిపించారు. 

2010లో హిందీలో వచ్చిన సూపర్ హిట్ బొమ్మ 'పస్ గయారే ఒబామా' అనే సినిమాకి అధికారిక రీమేక్ గా చెప్పుకునే సినిమా ఈ శంకరాభరణం. కోన వెంకట్ ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ తో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసాడు. కానీ ఎందులోనూ సక్సెస్ కాలేదు. ఒరిజినల్ కథలో ఉన్న ఫ్రెష్ నెస్ కి తన మార్క్ పైత్యాన్ని జత చేసి మొదట కథని చేడగొట్టేసారు. కథకి అవసరమే లేని ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ని ఒకదానిని క్రియేట్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా దాని మీదే నడిపించారు. అదేమన్నా కొత్తగా రాసుకున్నారా అంటే అదీ లేదు. ఎప్పుడు తన కథల్లో ఉండే అదే సొల్లు సీన్స్ అండ్ ఎమోషన్స్. కావున కథలో ఉన్న ఫ్రెష్ నెస్ పోయింది, ఆయన రాసుకున్న ఎమోషన్స్ కనెక్ట్ అవ్వలేదు. ఓవరాల్ గా హిట్ స్టొరీని ఫట్ స్టొరీగా డెవలప్ చేసాడు. అలాగే సెకండాఫ్ ని అయితే గజిబిజి గందరగోలంగా చేసి సినిమాని తినడానికి పనికిరాని కిచిడీలా చేసిపారేసారు.


ఇక కథనం పరిస్థితి అయితే అదొగతే అని చెప్పాలి. మొదటి 10 నిమిషాల్లో సినిమా ఏంటి, క్లైమాక్స్ ఏంటి నేది తెలిసిపోతుంది. అలాగే కథనం ఒక పాత్రతో రన్ అవ్వదు, ఎవడు పడితే వాడొచ్చి మార్చేస్తుంటాడు. చూసే ప్రేక్షకులకి పిచ్చ బోర్ కొట్టడమే కాకుండా ఇర్రిటేషన్ తెప్పించాడు. ఇక ఇష్టం వచ్చినట్టు పంచ్ లు మాత్రమే ఉన్న ప్రాస డైలాగ్స్ రాసేసారు. దానివలన సినిమాకి ఒరిగిందేమీ లేదు.


ఇక డైరెక్షన్ ఉదయ్ నందనవనం చేస్తే, మళ్ళీ కోన దానికి దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు. ఇలా ఇద్దరు చేసినా సినిమాలోని ఏ ఎమోషన్(బాధ, కోపం, సెంటిమెంట్, ట్రాజిడీ)ని సరిగా కాప్చ్యూర్ చేయలేకపోయారు. డైరెక్షన్ పరంగా వెరీ వీక్ టేకింగ్. కోన నుంచి ఇంతకన్నా వరస్ట్ మళ్ళీ ఆశిచలేం అనే చెప్పాలి. లాజికల్ పరంగా చూసుకుంటే.. పేరుకి పెద్ద కిడ్నాపర్స్ కానీ ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంటారు? ఎలా అంటున్నా? అలాగే రావు రమేష్ చదువుకున్నాడు అని చెప్తారు కానీ విసా పేపర్స్ అని నో అబ్జెక్షన్ లెటర్ ఇస్తే కూడా చూడడు, పైగా చదువుకొని వాళ్ళలా వేలి ముద్ర వేస్తాడు. అలాగే హీరో - హీరోయిన్ మధ్య ఒక్క లవ్ సీన్ కూడా ఉండదు కానీ చివర్లో ఇద్దరికీ ప్రేమ వచ్చేస్తుంది. అలాగే ఒరిజినల్ వెర్షన్ లోని కంటెంట్ ని ఇప్పటికే చాలా మంది తెలుగు సినిమాల్లో వాడేసుకోవడం వలన ఆకిక్ కూడా దొబ్బింది. 


మిగతా టెక్నీకల్ టీం గురించి చెప్పాలంటే ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ యావరేజ్ అనిపించినా నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్ ద్వారా బిహారీ ఫ్లేవర్ ని బాగా తీసుకొచ్చాడు. చిన్నా ఆర్ట్ వర్క్ బాగుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాలేదు. విజయ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఓకే ఓకే అనేలా ఉన్నాయి. ఎంవివి సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మెచ్చుకోదగిన విధంగా ఉన్నాయి. 

ఒక రీమేక్ సినిమాని ఏదో డెవలప్ చేసి ఎలా చెడగొట్టచ్చు అన్నదానికి ప్రతీకగా ఈ శంకరాభరణం సినిమాని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోన వెంకట్ నాకు ఒరిజినల్ వెర్షన్ లోని హీరో గేమ్ ప్లాన్ నచ్చింది అదే ఈ సినిమాకి తీసుకున్నాను అని చాలా చోట్ల చెప్పాడు, కానీ కొత్తగా అనిపించే ఆ పాయింట్ నే ఈయన అటూ ఇటూ మార్చేసి ఒరిజినల్ ఫ్లేవర్ ని మిస్ చేసేసాడు.


రీమేక్ అంటే అక్కడి మేజిక్ ని ఇక్కడ రీక్రియేట్ చేయాలి, లేదా ఇక్కడ యాడ్ చేసుకున్న సీన్స్ తో అన్నా మేజిక్ చెయ్యాలి. కానీ శంకరాభరణంలో ఒరిజినల్ వెర్షన్ లోని ఫీల్ మిస్ అయ్యింది, అలాగే జత చేసిన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్ గా నిఖిల్ కెరీర్ కి మరో బిగ్ ఫ్లాప్ అండ్ తన కెరీర్ పై నెగటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే సినిమా ఇది. ఓవరాల్ గా శంకరాభరణం 145 నిమిషాల పాటు భరించలేని టార్చర్.   

Nikhil,Nanditha,Anjali,Uday Nandanavanam,Kona Venkat,Praveen Lakkarajuశంకరాభరణం - ప్రేక్షకులు భరించలేని భారం.

మరింత సమాచారం తెలుసుకోండి: