నటీనటుల పెర్ఫార్మన్స్ , ఆసక్తికరమైన స్టొరీ , సినిమాటోగ్రఫీ , సినిమా చివర్లో వచ్చే సూపర్బ్ ట్విస్ట్స్నటీనటుల పెర్ఫార్మన్స్ , ఆసక్తికరమైన స్టొరీ , సినిమాటోగ్రఫీ , సినిమా చివర్లో వచ్చే సూపర్బ్ ట్విస్ట్స్విచ్చలవిడిగా వచ్చే పాత్రలు , మధ్యలో సినిమా బాగా స్లో అవ్వడం , స్లో నెరేషన్ , ఆద శర్మ ఎమోషన్స్ , సాగదీసిన క్లైమాక్స్

అమెరికాలో ఓ మంచి జాబ్ చేస్తున్న రిషి(అడవి శేష్)కి అతనికి ఓ రోజు ఇండియాలో ఉంటున్న తన మాజీ లవర్ అయిన శ్వేత(ఆద శర్మ) నుంచి ఫోన్ కాల్ వస్తుంది. తను రిషిని ఓకే సాయం అడుగుతుంది. తన కూతురు రియా రెండు నెలల నుంచి కనిపించడం లేదని, ఎవరు కిడ్నాప్ చేసారో తెలియడం లేదని తన కూతురుని వెతికి పెట్టమని సాయం కోరుతుంది. తన కోసం ఇండియాకి వస్తాడు.. వచ్చి శ్వేత నుంచి జరిగింది తెలుసుకొని ఆ పాపని వెతకడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో పాప స్కూల్ వారి నుంచి, పోలీసుల నుంచి ఎలాంటి సహాయం లభించదు. ఫైనల్ గా ఈ శ్వేత కుమార్తె గురించి ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి ఆచూకీ దొరకదు. శ్వేత భర్త అయిన కార్తీక్(సత్య) ఏమో అసలు పాపే లేదని శ్వేతకి యాక్సిడెంట్ వలన అలా ప్రవర్తిస్తోందని చెప్తాడు. దాంతో అసలు శ్వేతకి కూతురు ఉందా లేదా అనే అనుమానం కూడా వస్తుంది. ఇన్ని ప్రశ్నలని రిషి ఎలా చేధించాడు? చివరికి శ్వేత కూతురు దొరికిందా లేదా? శ్వేత తన భర్తని కాదని రిషి సాయం ఎందుకు కోరింది? అనే ఆసక్తికర విషయాలను వెండితెరపై చూసి తెలుసుకోండి.  

ఈ సినిమాలో కీ రోల్ చేసిన వారందరూ మంచి నటనని కనబరిచి సినిమాకి చాలా బలాన్ని చేకూర్చారు. ప్రతి ఒక్కరూ ఇది వరకూ కనిపించని కొత్త తరహా పాత్రల్లో కనిపించడం వలన ఆ పాత్రలు కాస్త ఆసక్తిని క్రియేట్ చేస్తాయి. అడవి శేష్ ఫ్లాష్ బ్యాక్ లో కాలేజ్ లవర్ బాయ్ లుక్ లో, ఆ తర్వాత ఒక కేసుని సాల్వ్ చేయడం కోసం ప్రయత్నించే రెస్పాన్సిబుల్ ఎక్స్ లవర్ గా బాగా చేసాడు. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఇంకా ఇంప్రూవ్ కావాల్సింది. ఆద శర్మ ఫ్లాష్ బ్యాక్ లో క్యూట్ గర్ల్ గా కనిపించి ఆకట్టుకుంటే, కుమార్తె తప్పి పోయినప్పుడు ఎమోషనల్ మదర్ గా ప్రేక్షకులను మెప్పించింది.  ఇలా వీరిద్దరూ రెండు షేడ్స్ ని చాలా బాగా చేసారు. పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాంకర్ అనసూయ చాలా బాగా చేసింది. అక్కడక్కడా ఇంకాస్త బెటర్ మెంట్ చేసుండాల్సింది. తన నటనలోని టాలెంట్ ని ఇందులో చూడచ్చు. తను చేసిన రిస్కీ స్టంట్స్ కూడా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తాయి. సత్యం రాజేష్ అయితే తన సీన్స్ తో సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యాడు. ఇక సైకో బ్రదర్ గా రవి వర్మ, క్యాబ్ డ్రైవర్ గా వెన్నెల కిషోర్ బాగా చేసాడు.

కొత్త డైరెక్టర్ అయిన రవికాంత్ మొదటి సినిమా అయినప్పటికీ సినిమాని చాలా వరకూ బాగా డీల్ చేసాడు. క్షణం సినిమా మొదలైన 30 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఎక్కడా బోర్ కొట్టకుండా ట్విస్ట్ లతో, ఓ క్యూట్ లవ్ స్టొరీతో ప్రేక్షకులను మెప్పించాడు. కానీ ఆ తర్వాతే సినిమా బాగా బోరింగ్ గా తయారైంది. మెయిన్ గా ఇంకో సమస్య ఏమిటంటే సినిమా మొదటి గంటలోపే సినిమాలో మిడ్ పాయింట్ ని రీచ్ అయిపోవడం వలన ఆ తర్వాత చెప్పడానికి ఏమీ లేదు. అందుకే ఫస్ట్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు బాగున్నా ఆ తర్వాత స్లో అవుతుంది. దాని వలన సెకండాఫ్ నేరేషన్ బాగా స్లో అవుతుంది. ఇన్వెస్టిగేషన్, ఎమోషన్స్ మరియు మధ్యలో లవ్ ట్రాక్ అనేది చూపించాలి అనుకోవడం వలన మనకు కూడా కాస్త బోర్ కొడుతుంది. ఇక ఫైనల్ గా ఓకే అపాయింట్ దగ్గర టెన్షన్ క్రియేట్ చేసారు.. ఆ టెన్షన్ ని క్లైమాక్స్ కి తీసుకొచ్చే సరికి నరాలు బిగ బెట్టుకొని ఆడియన్స్ ఏదో ట్విస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అస్సలు ఏమీ జరగదు.. దాంతో ఆడియన్స్ బాగా నిరుత్సాహ పాడుతారు. మెయిన్ గా క్లైమాక్స్ ని బాగా డ్రాగ్ చేసేసారు. ఇక లాజికల్ గా చూసుకుంటే కిడ్నాప్ తర్వాత రియా తన మదర్ ని మర్చిపోతుంది. ఎలా మరచిపోయింది, ఎందుకు మరచిపోయింది అనే అంశాలను మనకు చూపించలేదు. ఇక డైరెక్టర్ గా రవికాంత్ విషయానికి వస్తే.. మనం తెలుగు సినిమాలలో ఈ మధ్య రాణి డీసెంట్ స్టఫ్ ని మనకు క్షణం సినిమా ద్వారా అందించాడు. ఈ సినిమా కోసం వీరు అక్వారియస్, కహాని మరియు అగ్లీ అనే సినిమాల నుంచి కూసింత స్ఫూర్తి తీసుకొని క్లైమాక్స్ వరకూ ఆ ఫ్లేవర్ నే ఫాలో అయ్యారు కానీ ఫైనల్ గా క్లైమాక్స్ ని మాత్రం మార్చారు. కానీ కాన్సెప్ట్ కి వీళ్ళ క్రియేటివిటీ మరియు మన నేటివిటీని బాగానే మిక్స్ చేసారు. సెకండాఫ్ పరంగా మాత్రం డైరెక్టర్ మార్క్స్ కొట్టేసాడు. అంతే కాదు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ మరో విషయాన్ని నిరూపించాడు. అదే.. సినిమా అనేది ఎప్పుడు ఓ మచి కథ వల్లే సేల్ అవుతుంది. ఆ మంచి కథకి గుడ్ డైరెక్షన్ కూడా తోడైతే సినిమా సక్సెస్ అనే దానికి ఇది ఉదాహరణ.

శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించిన పాటలు బాగున్నాయికానీ వినగానే నచ్చాయి. సినిమాలో చూసినప్పుడు, చెలియా, క్షణం సాంగ్స్ బాగుంటాయి. ముఖ్యంగా నేపధ్య సంగీతంకి స్పెషల్ క్రెడిట్ ఇవ్వాలి. తను సస్పెన్స్ ఎపిసోడ్స్ కి ఇచ్చిన మ్యూజిక్ మరియు ట్విస్ట్స్ సమయంలో అతను ఇచ్చిన మ్యూజిక్ సినిమాని ఒక రేంజ్ కి తీసుకెళ్ళింది. శానియాల్ డియో సినిమాటోగ్రఫీ సినిమాకి మరో హైలైట్. చాలా లో బడ్జెట్ సినిమాకి హాయ్ రేంజ్ బడ్జెట్ ఫిల్మ్ కి ఇచ్చే విజువల్స్ ఇచ్చాడు. ఎడిటర్ ఇంకాస్త సినిమాని ట్రిమ్ చేసి బోరింగ్ అండ్ సాగదీసిన ఎపిసోడ్స్ ని లేపేయాల్సింది.  డైలాగ్స్ యావరేజ్ గా ఉన్నాయి. 


ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పాలి. అలాంటి కొత్త తరహాలో వచ్చిన సినిమానే క్షణం. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కొన్ని కొన్ని మొమెంట్స్ కచ్చితంగా మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. కానీ ఈ సినిమా నెరేషన్ చాలా చాలా స్లోగా ముందుకెళ్లడమే కాస్త బోర్ కొట్టే అంశం. సింపుల్ గా థ్రిల్లర్ సినిమాలు నచ్చే వారికి బాగా నచ్చే సినిమా క్షణం.  

Adivi Sesh,Adah Sharma,Anasuya Bharadwaj,Ravi Kanth P,PVP Cinema,Sricharan Pakalaక్షణం - కొత్తగా అనిపిస్తూ థ్రిల్చేసే థ్రిల్లర్.

మరింత సమాచారం తెలుసుకోండి: