ఓ వారం నుండి ఎక్కడ చూసినా సర్దార్ సర్దార్ సర్దార్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ పీక్స్ లో ఉన్న ఈ టైంలో సర్దార్ గబ్బర్ సింగ్ గా వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తానే కథ కథనాలు అందిస్తూ.. మరోసారి తన సరికొత్త స్టైల్ తో కేక పెట్టించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇప్పుడు రేపు రిలీజ్ అవుతున్న సర్దార్ సినిమా మొదటి రివ్యూ కోసమే అందరు ఎదురుచూస్తుంటారు.


అసలు ఇంత భారీ క్రేజ్ తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుంది.. ఎలా ఉండబోతుంది అన్నది టాక్. అయితే సినిమా ఆల్రెడీ యూ.ఏ.ఈలో షో పడటం సర్దార్ మేనియా స్టార్ట్ అవడం జరిగింది. అవును యూ.ఏ.ఈకి చెందిన ఓ సిని రివ్యూయర్ సర్దార్ పక్కా పైసా వసూల్ మూవీ.. ఫ్యాన్స్ కు ఇది కచ్చితంగా సూపర్ జోష్ ఇస్తుంది అని టాప్ మోస్ట్ 5 రేటింగ్ ఇచ్చాడు.


సర్దార్ సినిమాలో పవర్ స్టార్, కాజల్ :


ఉమెర్ సంధు యూకెలో సిని మాగజైన్ ఏడిటర్..  అంతేకాదు యూకె సెన్సార్ సభ్యుడు కూడా.. మొదటి సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూ అందించిన ఉమెర్ సంధు ఆ సినిమాను ఆకాశానికెత్తేస్తున్నాడు. ఇది ఓ పక్కా పైసా వసూల్ సినిమా అని.. పవన్ కళ్యాన్ వన్ మ్యాన్ షోతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటాడని.. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ట్వీట్ చేశారు. ఇక కాజల్ మరోసారి తన అందంతో కట్టి పడేసిందని.. ఓ సూపర్ బ్యాంగ్ తో మళ్లీ ఆమె తిరిగి ఫాంలోకి వచ్చిందని.. పవర్ స్టార్ తో ఆమె కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యిందని రాశారు.        


విలన్ శరత్ ఖేల్కర్ కూడా తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడని.. దేవి మరోసారి అదరగొట్టేశాడని ట్వీట్ చేశారు. ఇక సినిమా ఓవరాల్ గా సింపుల్ స్టోరీ, నీట్ స్క్రీన్ ప్లే, మంచి ఎడిటింగ్, చప్పట్లు కొట్టించే డైలాగ్స్, ఇక ఫైనల్ గా కేక పెట్టించే యాక్షన్ స్టంట్స్ సో ఇన్ని అంశాలు సర్దార్ లో ఉన్నాయని ఆయన వ్యక్తపరిచారు. సో ఉమేర్ సంధు చెప్పిన లెక్కల ప్రకారం సినిమా పవర్ స్టార్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అనిపిస్తుంది. మరి తెలుగు ప్రేక్షకులు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: