స్టార్ హీరో ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రెజెన్స్ చేయగలిగిన దర్శకుల్లో ప్రస్తుతం టాలీవుడ్లో బోయపాటిని మించి వారు లేరనే చెప్పాలి. భద్రతో మొదలైన ఆయన సిని ప్రస్థానం రీసెంట్ గా రిలీజ్ అయిన సరైనోడు దాకా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అయితే సినిమా ఫలితాలు ఎలా ఉన్నా ఓ హీరోని మాస్ హీరోగా చేయడంలో బోయపాటిని మించిన దర్శకుడు లేడనే చెప్పాలి. 


దర్శకుడిగా కాక ముందు సహాయక దర్శకుడిగా పనిచేసిన బోయపాటి భద్ర సినిమాతో దర్శకుడిగా మారాడు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఆ సినిమా 2005లో సూపర్ హిట్ అయ్యింది. రవితేజ, మీరా జాస్మిన్ జంటగా నటించిన ఆ సినిమాతోనే తన మార్క్ ఏంటో చూపించాడు బోయపాటి.  


సింహా వర్కింగ్ స్టిల్ :


ఇక ఆ తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని 'తులసి' అంటూ మరో సూపర్ హిట్ అందించాడు బోయపాటి. విక్టరీ వెంకటేష్, నయనతారా జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత నందమూరి నట సింహం బాలయ్యతో పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు బోయపాటి. 


సింహాతో ఒక్కసారిగా బాలయ్యలోని ఉగ్ర నరసింహ అవతారాన్ని మరోసారి స్క్రీన్ మీద ఆవిష్కరించిన బోయపాటి శ్రీను కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న బాలయ్యకు సూపర్ హిట్ అందించాడు. ఇక ఆ క్రేజ్ తోనే జూనియర్ ఎన్.టి.ఆర్ దమ్ము అవకాశాన్ని కొట్టేశాడు. దమ్ము సినిమాలో మరోసారి తారక్ దమ్ముని చూపించి వారెవా అనిపించిన బోయపాటి ఆ సినిమా ఫలితానని మాత్రం మిశ్రమంగా అందుకున్నాడు. 


దమ్ము సినిమా షూట్ లో ఎన్టీఆర్, బోయపాటి :


ఇక మళ్లీ తనకు సింహా లాంటి హిట్ ఇచ్చిన బాలయ్యతోనే లెజెండ్ అంటూ తీసి మరో సూపర్ హిట్ కొట్టాడు. తీసిన 6 సినిమాల్లో 4 సూపర్ హిట్స్ రెండు యావరేజ్ సినిమాలను అందుకున్న బోయపాటి కెరియర్ లో ఫెయిల్యూర్ అన్నదే లేదని చెప్పాలి. ఇక బోయపాటి సినిమాలో హీరో అంటే యాక్షన్స్ తో ఇరగదీస్తాడంతే.. మాస్ ఊర మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన బోయపాటి హీరోలను బి,సి సెంటర్స్ అభిమానులకు చేరువయ్యేలా చేయడంలో సూపర్ సక్సెస్ అవుతున్నాడు. అంతేకాదు బోయపాటికి మాస్ పల్స్ బాగా తెలుసనీ అందరు అంటుంటారు. 


సరైనోడు వర్కింగ్ స్టిల్ :


రీసెంట్ గా రిలీజ్ అయిన స్టైలిష్ స్టార్ సరైనోడు కూడా బి,సి సెంటర్స్ లో హౌజ్ ఫుల్స్ తో నడుస్తుంది. తన సినిమాలో హీరో అంటే ఓ పవర్ ఫుల్ మిషన్ లా చూపించే బోయపాటి తన తర్వాత ప్రాజెక్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్నాడు. మరి ఈరోజు పుట్టినరోజు జారుపుకుంటున్న బోయపాటి శ్రీను కెరియర్ లో మరిన్ని సక్సెస్ కు సాధిచి స్టార్ డైరక్టర్ గా ఓ వెలుగు వెలగాలని ఆశిద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: