ఫస్ట్ హాఫ్, ఎమోషన్ , ఉపేంద్ర నటన ,రాగిణి అందాలుఫస్ట్ హాఫ్, ఎమోషన్ , ఉపేంద్ర నటన ,రాగిణి అందాలుసెకండ్ హాఫ్ , స్క్రీన్ ప్లే , డైరక్షన్

బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన బసవన్న (ఉపేంద్ర) విలాసవంతంగా దేశదేశాలు తిరుగుతూ జీవితాన్ని గడుపుతుంటాడు. తండ్రి వారసత్వ భాద్యతను మరచి తిరుగుతున్న బసవన్నకు అనుకోకుండా తండ్రి చనిపోవడంతో తమ ప్రాంతంలోని పుణ్యక్షేత్రానికి ప్రధాన అర్చకుడిగా మారాల్సి వస్తుంది. తండ్రి భాధ్యతను చేపట్టిన బసవన్న దేవాలయంలో జరుగుతున్న అన్యాయాలను గమనిస్తాడు. ఇక వాటిని అరికట్టే ప్రయత్నంలో తన మీద హత్యాప్రయత్నం జరగడం వారి నుండి బసవన్న తప్పించుకోవడం జరుగుతుంది. అసలు బసవన్న ఎవరు..? తనను వచ్చి కాపాడింది ఎవరు..? తనను ఎందుకు చంపాలనుకున్నారు..? అన్నది అసలు కథ. 

బ్రహ్మణ అంటూ సంచలన టైటిల్ తో కొద్దిరోజులుగా హడావిడి చేస్తున్న ఉపేంద్ర ఎట్టకేలకు ఈరోజు థియేటర్స్ కు వచ్చాడు. ఇక సినిమాలో మరోసారి తన మార్క్ అద్భుత నటన కనబరిచాడు ఉపేంద్ర. అప్పటిదాకా లైఫ్ ఎంజాయ్ చేసి అర్చకుడిగా తండ్రి భాధ్యత తీసుకునే టైంలో ఎమోషన్ బాగా పండుతుంది. ఇక సినిమాలో విలన్ గా చేసిన రవిశంకర్ కూడా పర్వాలేదు. ఇక హీరోయిన్ సలోని చిన్న పాత్రకే అంకితమవ్వగా.. రాగిణి ద్వివేది గ్లామర్ లుక్ లో దర్శన మిచ్చింది. తనలోని హాట్ యాంగిల్ చూపించిన రాగిణి కనిపించినంత సేపు ఎట్రాక్ట్ చేసింది. ఇక మిగతా నటీనటులంతా తమ తమ పరిధి మేరకు నటించారు. 



బ్రాహ్మణ సినిమా టెక్నికల్ టీం గురించి చెప్పాల్సొస్తే.. ముందుగా దర్శకుడు శ్రీనివాస్ రాజు గురించి చెప్పాలి.. కథ బాగానే రాసుకున్న శ్రీనివాస రాజు దాన్ని తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. సినిమాలో మణిశర్మ సాంగ్స్ ఒక్కటి సరిగా లేదు. సినిమాకు పనిచేసిన కెమెరామన్ పర్వాలేదనిపించినా ఎడిటింగ్ వర్క్ మాత్రం ఇంకాస్త బెటర్ గా చేసి ఉండాల్సింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదన్నట్టు ఉంటాయి.

బ్రహ్మణ అంటూ టైటిల్ ఎనౌన్స్ చేసిన నాటి నుండి జనాల నోట్లో నానుతున్న ఈ సినిమా ఉపేంద్ర మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చింది. అయితే ముందు చెప్పినట్టుగా సినిమా కథ బాగానే రాసుకున్న దర్శకుడు శ్రీనివాస రాజు దాన్ని తెరకెక్కించడంలో ఏమాత్రం ఆకట్టుకోలేదు. మొదటి భాగంలో వచ్చే కొన్ని ఎమోషన్స్ సీన్స్ పర్వాలేదు అనేట్టుగా ఉన్నా ఇక సెకండ్ హాఫ్ లో సినిమా ఎక్కడెక్కడికో తీసుకెళ్లి గందరగోళం చేసేస్తాడు.  

అర్చకుడితో స్టార్ట్ అయ్యి మాఫియా, టెర్రరిజం దాకా సినిమా తీసుకెళ్లిన ప్రయత్నం దెబ్బేసిందని అనాలి. ఉపేంద్ర కాబట్టి ఆ పాత్రలన్నా కనీసం అలరించాయి. ఇక విలన్ గా రవిశంకర్ అంత గొప్పగా ఏం చేయలేదు. అనుకున్న పాయింట్ కు అనవసరమైన గందలగోళం సృష్టించుకుని అసలకే మోసం వచ్చేలా చేశాడు దర్శకుడు శ్రీనివాస రాజు. 

కన్నడలో దండుపాళ్యం సినిమా తీసి అక్కడ హిట్ కొట్టి తన సత్తా చాటుకున్న శ్రీనివాస రాజు 'శివం' పేరుతో లాస్ట్ ఇయర్ తీసిన ఈ సినిమా తెలుగులో బ్రాహ్మణగా రిలీజ్ అయ్యింది. అయితే దండుపాళ్యం కోసం తన ఎఫర్ట్ ఫుల్ పెట్టేసిన దర్శకుడు బ్రహ్మణ విషయంలో చాలా మిస్ టేక్స్ చేశాడు.  

సినిమా బాగుంటే డబ్బింగ్ సినిమా అయినా బిచ్చగాడిని కూడా కోటిశ్వరుడిగా చేసే తెలుగు ఆడియెన్స్ ఇలాంటి సినిమాలను టైటిల్, ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయినా సినిమా చూస్తే మాత్రం షాక్ అవ్వక తప్పదు. ఉపేంద్ర సినిమాలను ఇష్టపడే వారికి, మరి బోర్ కొట్టి ఏదైనా ఓ సినిమా చూసేద్దాం అనుకున్న వారికి ఇది ఏ కోశానైనా నచ్చొచ్చు కాని రెగ్యులర్ ఆడియెన్స్ కు కిక్ ఇచ్చే సినిమా అయితే కాదు. 


Upendra,Saloni Aswani,Ragini Dwivedi,Srinivas Raju,M Vijay,Gurram Mahesh Chowdary,Mani Sharmaఉపేంద్ర 'బ్రాహ్మణ' నిరాశ పరచాడబ్బా..!

మరింత సమాచారం తెలుసుకోండి: