కథ, కథనం, డైరక్షన్ ,ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కథ, కథనం, డైరక్షన్ ,ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అవడం ,కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సింగ్

ప్రశాంత్ (విజయ్) ఈ జెనరేషన్ కుర్రాడు.. ఇంజనీరింగ్ అతికష్టం మీద పాస్ అవుతాడు. సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేద్దామనుకునే ప్రశాంత్ చెఫ్ గా పనిచేయాలని నిర్ణయించుకుంటాడు. ఇక చిత్ర (రీతు వర్మ) ప్రశాంత్ ఆలోచనలకు పూర్తి విరుద్ధమైన మనస్థత్వం గల అమ్మాయి. పెళ్ళితో అయినా లైఫ్ సెటిల్ అవుతుందేమో అని చిత్రతో పెళ్లి నిశ్చయిస్తాడు ప్రశాంత్ వాళ్ల నాన్న. అయితే తన ఆలోచనలకు విరుద్ధంగా ఉన్న ప్రశాంత్ కు చిత్ర నో చెబుతుంది. ఇక అదే క్రమంలో ప్రశాంత్ మళ్లీ వేరే అమ్మాయితో పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇక అక్కడ ప్రశాంత్ కు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అసలు ఇంతకీ ప్రశాంత్ చిత్రల పెళ్లి జరిగిందా..? ప్రశాంత్ రెండో పెళ్లి చూపుల్లో తను ఎదుర్కున్న సవాల్లేంటి..? చివరికి కథ ఎలా సుఖాంతం అయ్యింది అన్నది అసలు సినిమా. 

పెళ్ళిచూపులు సినిమాలో హీరో విజయ్ దేవరకొండ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకున్నాడు. చేసింది రెండో సినిమా అయినా ఎక్కడ ఆ డౌట్ రాకుండా ఎంతో పరిణితి చెందిన నటుడిగా చేశాడు. ప్రశాంత్ క్యారక్టర్ విజయ్ నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. ఇక స్వతంత్రమైన ఆలోచన థోరణి ఉన్న అమ్మాయిగా రితూ వర్మ అద్భుతంగా నటించింది. సినిమాలో మేజర్ హైలెట్ ఆమె పాత్రే అని చెప్పాలి. ఇక డైరక్టర్ అనీష్ కూడా ఈ సినిమాలో మంచి పాత్ర వేసి మెప్పించాడు. మిగతా నటీనటులంతా తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఈ చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీం విషయానికొస్తే ముందుగా దర్శకుడు తరుణ్ భాస్కర్ గురించి మాట్లాడాలి. తను రాసుకున్న ఓ చిన్న కథను అంతే అందంగా తెరకెక్కించడంలో ఎక్కడ పట్టు తప్పకుండా అనుకున్నది అనుకున్నట్టు తెర మీద ఆవిష్కరించాడు దర్శకుడు. తన ఆలోచనలు ఏవైనా దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ కరెక్ట్ గా ప్రెజెంట్ చేయడం ఇంపార్టెంట్.. అలా చేస్తే సినిమా ఆడియెన్స్ కు కచ్చితంగా రీచ్ అవుతుంది. నగేష్ బెగెల్లా కెమెరా పనితనం కూడా బాగుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా సినిమాకు తగ్గట్టుగా మంచిగా కుదిరింది. ఉన్నంతలోనే ప్రొడక్షన్ వరకు కూడా చాలా రిచ్ గా కనిపించేలా చేశారు.   

పెళ్ళి చూపులు.. తరుణ్ భాస్కర్ అనుకున్న ఓ చిన్న పాయింట్ తెర రూపం దాల్చడంలో సక్సెస్ అయ్యాడు. కొత్త దర్శకుడు కదా ఎక్కడో ఓ చోట కాస్త పట్టు తప్పే అవకాశం ఉంది. కాని సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తరుణ్ సినిమా మీద పూర్తిగా తన ముద్ర వేసుకున్నాడు. తన టేకింగ్ గురించి చెప్పాలంటే సినిమాలో తన సీన్ క్రియేషన్ చూస్తే అర్ధమవుతుంది.  


ఎంత పెద్ద సినిమా అయినా సరే సరైన కథనంతో నడిస్తే అది కచ్చితంగా ఆడియెన్స్ కు నచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ మంచి ప్రతిభ కనబరిచాడు. ఒక్క సినిమా అనుభవం ఉన్న స్టార్ కాస్ట్ తో మంచి అవుట్ పుట్ తీసుకుని సినిమాను ఎక్కడ స్టోరీ బౌడరీస్ దాటకుండా చేశాడు. తీసుకున్న కథ దానికి అల్లుకున్న కథనంతో పాటుగా ఆ కథనానికి తగ్గ మాటలను కూడా పొందుపరచి ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని కలిగించేలా చేశాడు. 


సినిమా అంతా ఓ సక్సెస్ ఫుల్ ప్రయత్నంగా చేసిన పెళ్లి చూపులు కొత్త సినిమాలు కోరుకునే సిని అభిమానులకు తప్పకుండా నచ్చుతుంది. ఇక రొటీన్ మాస్ మసాలా కామెడీ ఎంటర్టైన్ మెంట్ కోరుకునే వారికి ఇది నచ్చే అవకాశం లేదు. 
Vijay Devarakonda,Ritu Varma,Tharun Bhaskar,Raj Kandukuri,Yash Rangineni,Vivek Sagar.తెలుగు సినిమాకు కొత్త దారులు ఈ 'పెళ్ళిచూపులు'

మరింత సమాచారం తెలుసుకోండి: