రామ్ చరణ్ హిందీలో తొలిసారిగా నటిస్తున్న సినిమా ‘జంజీర్’. అమితాబ్ నటించిన సూపర్ హిట్ సినిమా జంజీర్ ను ప్రస్తుత కాలానికి అనుగుణంగా రీమిక్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ చెపుతుంది. అలాగే, ఈ జంజీర్ సినిమా కోసం హీరోయిన్ ప్రియాంక చోప్రా పై ఒక ఐటెం సాంగ్ ను చిత్రీకరించినట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్పాడు. ‘పింకీ’ అనే ఐటెమ్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఈ పాటలో ప్రియాంక రెచ్చిపోయి డాన్స్ చేసిందని తెలుస్తోంది. జంజీర్ సినిమాను మే 10న విడుదల చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, ఈ జంజీర్ తెలుగు వెర్షన్ కు ‘మెరుపు’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వస్తున్న వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. జంజీర్ తెలుగు వెర్షన్ కు ఇంకా ఎలాంటి పేరు నిర్ణయించలేదని చిత్ర యూనిట్ తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: