సిద్ధార్థ్, సమంత జంటగా రూపొందిన చిత్రం ‘జబర్దస్త్’. నందినీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రముఖలకోసం ప్రిమియర్ షోను భారీగా ప్లాన్ చేశారు నిర్మాత బెల్లంకొండ సురేష్. ప్రిమియర్ షో అంటే సాధారణంగా ఒక్క రోజే ఉంటుంది. కానీ, ఈ చిత్రాన్ని రెండు రోజులు షో వేద్దాం అనుకుంటున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఈ షోలు ఉంటాయి. అయితే ఇందులో మీడియా వారికి పిలుపు ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియవలసి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: