అటు కూతురు.. ఇటు సహజీవని.. మధ్య కమల్ హాసన్ నలిగిపోతున్నాడు. ఇద్దరికి సర్దిచెప్పలేక సతమతమవుతున్నాడు. ఒకరిని సమర్దిస్తే.. మరొకరి కోపానికి గురి కావాల్సి వస్తుండటంతో.. కమల్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలో మారింది . కమల్ హాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న శభాష్ నాయుడు చిత్రంలో శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆయన పార్టనర్ గౌతమి స్టైలిస్ట్ గా పనిచేస్తోంది. 


శభాష్ నాయుడు సినిమా కాస్ట్యూమ్స్ విషయంలో శృతి, గౌతమి మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం షూటింగ్ సెట్స్లో ఉండగా  శృతి హాసన్, గౌతమీ మధ్య ఫైట్ జరిగిందని కోలీవుడ్ వర్గాలు కోడైకూసాయి. సినిమాలో శృతిహాసన్, కమల్ హాసన్ ఇద్దరూ తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. గౌతమి సినిమాకు క్యాస్టూమ్స్ డిజైనర్ గా ఉన్నారు.  గౌతమి రూపొందించిన దుస్తులు తన క్యారక్టర్ కు నప్పవని శృతి చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైందట. తనకు అస్సలు సూట్ కాని దుస్తులను డిజైన్ చేసినందుకు గౌతమిపై శృతి ఫైర్ అయ్యిందట.


గొడవ సమయంలో వీరిద్దరి మధ్యకు వెళ్లేందుకు కమల్ సహా చిత్ర యూనిట్ సభ్యులెవరు సాహసించలేదట.  కేవలం ఈ సినిమా విషయంలోనే కాదు, ఇప్పటికే పలుమార్లు గౌతమి తన కోసం డిజైన్ చేసిన దుస్తులను ధరించేందుకు శృతి వ్యతిరేకించింది. ఆమె డిజైన్స్ నచ్చకపోవడమే అందుకు కారణమట. ఏదేమైనా ఈ ఇద్దరి గొడవ కారణంగా ఓ రోజు షూటింగ్కు సెలవు చెప్పాల్సివచ్చింది.


గొడవను పెంచుకుంటూ పోతే తమ కుటుంబానికే నష్టమనుకుందో ఏమోకానీ.. గౌతమీతో ఎలాంటి విబేధాలు లేవని శృతి హాసన్ తన అధికార ప్రతినిధితో ఓ ప్రకటన విడుదల చేయించింది. గౌతమి, తన మధ్య గొడవ జరిగినట్లు వచ్చిన వార్తలు నిరాధారమైనవి అందులో పేర్కొంది. దుస్తులన్నింటినీ చిత్రీకరణ ప్రారంభానికి ముందే సెలక్ట్ చేసి, వాటితో ప్రీ షూట్ కూడా చేసినట్టు స్టేట్మెంట్‌లో వెల్లడించింది. తమ ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది తప్ప, విభేదాలు లేవంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: