బాలీవుడ్ మాజీ సెక్స్ బాంబ్ జీనత్ అమన్ మళ్లీ పెళ్లి చేసుకుంటుందనే వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను జీనత్ అమన్ ఖండించింది.‘నాకిప్పుడు వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేదు. యుక్త వయస్సులో ఉన్న నా కొడుకులిద్దరికి వివాహం చేయడంపైనే ప్రస్తుతం నా దృష్టి ఉందని’ జీనత్ అమన్ తెలిపింది. తన పెళ్లి అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైన జీనత్ అమన్ స్పష్టం చేసింది. కాగా, బాలీవుడ్ మీడియా వర్గాల కథనం వేరే విధంగా ఉంది. 62 ఏళ్ల జీనత్ అమన్ ముంబైకి చెందిన 36 ఏళ్ల బిజినెస్ మేన్ ను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడిందని, అయితే సన్నిహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ మాజీ సెక్స్ బాంబ్ వెనక్కి తగ్గిందని బాలీవుడ్ మీడియా అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: