దర్శకురాలు నందినీరెడ్డి చిత్రం ‘జబర్ దస్త్’ విడుదలకు సిద్ధమౌతోంది. సమంత, సిద్ధార్థ్ లు జంటగా నటిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు బై ఎ సర్టిఫికేట్ దక్కించుకుంది. ఈ సినిమాలో కొన్ని పదాలకు కత్తెర పడింది. అవేంటంటే... ‘నిత్యానంద స్వామి’, ‘లంచం తీసుకున్న న్యాయమూర్తి’, ‘కల్కి’, ‘మాయావతి’ లాంటి పదాలపై బీప్ సౌండ్ వేయమన్నారట. ఈ సినిమాలో సూపర్ హిట్టయిన పాట ‘అల్లా అల్లా’ పాటలోని ఆ రెండు పదాలనీ తొలగించమన్నారట. వాటికి బదులు ‘హల్లా గుల్లా’ పదాలను వాడుకోవచ్చని తెలిపినట్టు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: