బాలీవుడ్ లో మంచి నటి గా గుర్తింపు తెచ్చుకున్న నూతన్ ప్రేక్షకుల అభిమాన్ని కూడా అదే స్థాయిలో పొందింది. సీమ, ఛహలియా, సరస్వతిచంద్ర, దేవి, మైన్ తుల్సి తీరే అంగాని కి, సౌదాగర్ వంటి చిత్రాలు నూతన్ నటనా ప్రతిభకు నిదర్శనాలు. మహారాష్ర్టకు చెందిన నూతన్ సమర్థ్ ‘నగీనా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1951 లో విడుదలైన ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పటికీ నూతన్ కు 18 సంవత్సరాలు పూర్తి కాలేదు. దీంతో ఈ చిత్రం ప్రివ్యూ వేసినప్పుడు, తరువాత కొన్ని రోజుల పాటు ధియేటర్లోకి నూతన్ ను అనుమతించలేదు. తాను నటించిన చిత్రం తాను చూడలేక పోయినా, అప్పటి రోజుల్లో నిబంధనలు పాటించే తీరు గురించి నూతన్ తన చివరి రోజుల్లోనూ చెప్పుకునేది.

మరింత సమాచారం తెలుసుకోండి: