ఈ ఫోటో చూస్తే మీరు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నదియా చాలా కాలం తరువాత ‘మిర్చి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ కు తల్లిగా నటించింది. తల్లిగా నటించినా అక్క లా కనిపిస్తుందని చిత్రంలోని ఒక పాత్రతోనే చెప్పించారు. నదియా ఈ మిర్చి తో తాజాగా మరోసారి తెలుగు పరిశ్రమను ఆకర్షించింది. 1,2 కాదు ఏకంగా 8 తెలుగు సినిమాల్లో నదియా అవకాశాలు దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. కాగా, నదియా ఇంత కాలం ఖాళీగా ఏమీ లేదు. మలయాళ చిత్ర సీమలో బిజీగా ఉంది. అక్కడ ఆమె నటించిన చిత్రంలోనిదీ స్టిల్. ఈ ఫోటోలో నదియా చూసిన వారు ‘ప్రభాస్ మమ్మీ ఇంత హాటా...’ అని అశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: