పోర్న్ రంగం నుంచి బాలీవుడ్ లోకి ప్రవేశించిన సన్నిలియోన్ కు టైమ్ కలిసి వస్తుంది. అనుకోకుండా ఒక అవకాశం అమె తలుపుతట్టింది. ఇటీవలే ‘షూటవుట్ ఎట్ వాదాలా’ అనే సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో నటించింది. అయితే ఈ ఐటెం సాంగ్ కు ముందుగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ బిపాసబసును అనుకున్నారు. అయితే ‘షూటవుట్ ఎట్ వాదాలా’ చిత్ర కథానాయకుడు జాన్ అబ్రహాం ఆ ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో గాఢంగా ప్రేమవ్యవహారం నడిపిన బిపాస-జాన్ ఇప్పుడు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తమ మధ్య వచ్చిన మనస్పర్థలు వున్న కారణంగా బిపాసబసు ఎంపికపై జాన్ అబ్రహం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిపాసను కాదనుకుని సన్నీలియోన్ ను ఎంపిక చేశారు ‘షూటవుట్ ఎట్ వాదాలా’ దర్శక నిర్మాతలు. కలిసి వచ్చిన అదృష్టాన్ని కాదనకుండా సిన్నిలియోన్ అందిపుచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: