శంక‌ర్‌, క‌మ‌ల్‌హాస‌న్ అద్భుత సృష్టి భార‌తీయుడు. ఈ సినిమా అన్ని భాష‌ల్లోనూ ఘ‌న‌విజ‌యం సాధించింది. లంచ‌గొండిత‌నంపై ఇప్పుడు సినిమా చేసినా... భాయ‌తీయుడు ఛాయ‌లు క‌నిపిస్తాయి. దాన్ని దాటి సినిమా తీయ‌డం క‌ష్ట‌మే. ఇప్ప‌డు.. మ‌ళ్లీ శంక‌ర్ భార‌తీయుడు పై దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. భార‌తీయుడు సినిమాకి కొన‌సాగింపు తీయ‌డానికి ఆయ‌న స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. క‌మ‌ల్ కూడా ఓకే చెప్పాడ‌ట‌. వెంటనే శంక‌ర్ రంగంలో దిగి క‌థ రాసుకొనే ప్ర‌య‌త్నాల్లో ప‌డ్డాడు. మ‌రి న‌యా భార‌తీయుడు ఎలా ఉంటాడో? ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో? 

మరింత సమాచారం తెలుసుకోండి: